Skip to main content

శ్రీనరసింహ శతకము

(01) శ్రీమనోహర సురార్చిత సింధుగంభీర భక్తవత్సల కోటి భానుతేజ
కంజనేత్ర హిరణ్య కశిపు నాశక శూర సాధురక్షణ శంఖచక్రహస్త
ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శాయి కృష్ణవర్ణ
పక్షివాహన నీల భ్రమర కుంతలజాల పల్లవారుణ పాదపద్మ యుగళ
చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ
భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర

శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలేవాడవు. దుష్టులను శిక్షించువాడవు.

స్వామీ! నీవు శ్రీదేవికి భర్తవు. దేవతలచే పూజింపబడువాడవు. సాగర గంభీరుడవు. భక్తులను బ్రోచెడివాడవు. శతసహస్ర సూర్య తేజోమయుడవు. కమలనేత్రుడవు. హిరణ్యకశిపుని అంతమొందించిన శూరడవు. సాధుజన రక్షకుడవు. శంఖ చక్ర విరాజితుడవు. ప్రహ్లాదునికి వరములిచ్చినవాడవు. పాప సంహారుడవు. సర్వేశుడవు. పాలకడలిపై పవ్వళించినవాడవు. నల్లనివాడవు. గరుడవాహనుడవు. తుమ్మెదల వంటి నల్లనైన వెంట్రుకలు గలవాడవు. చిగురుటాకుల వంటి ఎర్రని చరణద్వయము కలవాడవు. శ్రీచందనాది సుగంధ ద్రవ్యములచే పూయబడిన పరిమళ దేహము కలవాడవు. మల్లెమొగ్గల వంటి దంత సౌందర్యం కలవాడవు.

జైనారసింహా

Comments

Popular posts from this blog

దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?

సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది. అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం న

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

తెలియక చేసిన తప్పులకు పరిహారమేమిటి?

సమాధానమ్: సాంసారిక జీవితంలో ఇలాంటి సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. చాలాచోట్ల తెప్పు తెలియక గతజలసేతుబంధనం లాగా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో మున్ముందుగా తన తప్పును పెద్దల దగ్గర ఒప్పేసుకోవాలి. ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని శపథం చేసుకోవాలి. ఆ తర్వాత చేసిన పాపానికి శాస్త్రీయమైన ప్రాయశ్చిత్తం ఏదో తెలుకునే ప్రయత్నం చేయాలి. అది చెప్పే వారు దొరకకపోయినా, చెప్పినా అది అసాధ్యంగా ఉన్నా, ఈ పాప ప్రాయశ్చిత్త నిమిత్తమని సంకల్పిస్తూ, యథాశక్తిగా భగవన్నామ స్మరణ చేతనైనంత దీర్ఘంగా చేయాలి. సర్వ ప్రాయశ్చిత్త విధులకూ ఇదే సారాంశం.