ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

శ్లోకం - భావము లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే," "స జాతో యేన జాతేన యాతి వంశః సమున్నతిం. - శ్లోకం - భావము

 "పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే," "స జాతో యేన జాతేన యాతి వంశః సమున్నతిం."   చావు పుట్టుకలు అనే చక్రంలో చిక్కుకోనిదెవరు? పుట్టినవాడు మరణిస్తాడు. మరణించినవాడు తిరిగి జన్మిస్తాడు. కానీ ఎవరి పుట్టుకతో అతని వంశానికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయో అతడే ధన్యుడు. అతని జీవితమే సార్థకం.

భారతీయ తత్త్వ విచారధారలో ఉపనిషత్తులు

 ఉపనిషత్తులు వేద భాగాలుగా సనాతనాలు. ఇందులో సత్యం భగవన్ముఖోదీరితం. ఈ సత్యం ప్రత్యక్షానుమానాది భౌతిక పరిచ్ఛిన్న ప్రమాణాల ద్వారా తెలుసుకొన్నది కాదు. మరి, ఋషులు సాక్షాత్తుగా దర్శించినది. మన ప్రత్యక్షానుభవంకంటే ఋషుల దర్శనానుభవం నిర్దుష్టం, ప్రామాణికం, వాస్తవం, దివ్యమూను. యాస్కుల వారు "సాక్షాత్కృత ధర్మాణః" అంటారు ఋషులని. వారి ప్రయత్నం లేకుండానే వారి ఎదలలో భాసించే దివ్య సత్యం ఇది. "పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం" అంటారు శ్రీశంకరులు ఈ సత్యాన్ని.

భగవన్నిశ్వసనం వేదాలు

 మనపై ప్రసరించి మనను ప్రభోదించి ప్రభావితం చేసే ఈశ్వరుని నిశ్వాసం వేదాలు. "యస్య నిశ్వసితం వేదాః" ఊపిరి ఉనికికి ఉత్ప్రేక్షకం. ఆయన ఉనికిని నిరూపించటంతో పాటు జాతికి ప్రాణవాయువును ప్రసాదించి జన్మకు చారితార్థ్యాన్ని ప్రతిపాదించేది ఈ నిశ్వసనం. ఊపిరి ఆగిపోతే ఉనికే సమసిపోతుంది. అందుకే భగవత్ సత్తను సందేహించే వారికంటే వేదాల ప్రామాణ్యాన్ని శంకించే వారినే మన వారు తీవ్రంగా పరిగణించేరు. వారినే నాస్తికులన్నారు, బాహ్యులన్నారు. ఈ నిశ్వాసాన్ని ప్రకృష్టంగా సమాకర్షించుకొన్నవారు, సమార్జించుకొన్నవారు ఋషులు. వారి ఎదలలో సునిక్షిప్తమైన ఈ నిశ్వాసమే దివ్యజ్ఞానాన్ని కల్గించి, దివ్య దర్శనాన్ని ప్రసాదించింది. అంచేతే వారి దర్శనం, వారి అనుభవం "పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం" అన్నారు మన పెద్దలు.

మౌనం ఒక మంత్రం

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం *మంత్రౌషథ   సమాగమాః * దాన మానా వమానాశ్చ నవ గోప్యాః  మనీషిభిః                       మనిషి అంటే సామాన్య మానవుడు. మనీషి అంటే ఉదాత్త మానవుడు. అలాంటి వారు 9 విషయాలలో గోప్యతను పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆవేమనగా  1. మన ఆయుష్షు మనకు తెలియదు. ఒక వేళ సిద్ధులు, యోగుల వలన తెలిసినా ఆడంబరంగా చెప్పుకోకూడదు. 2. మన నగ నట్రా, పొలాలు, స్థలాలు, నిధి నిక్షేపాలు పరులకు చెప్పరాదు.   3.ఇంటిగుట్టు గుట్టుగానే ఉంచాలి. రచ్చ చేయరాదు.  4. తేలు, పాము, విశేష మంత్రాలతో రోగులకు సేవ చేయవచ్చు. కాని ఆ మంత్రం వెల్లడించరాదు.   5. అలాగే దివ్యౌషథంతో రోగాలు నయం చేయవచ్చు కాని దాని మర్మం విప్పరాదు.   6.కీలక వ్యక్తులతో చేసిన మంతనాలను, చర్చలను బట్టబయలు చేయరాదు. ప్రాణాలకే ముప్పు రావచ్చు. 7.మనం చేసిన దానం, ధర్మం, ఉపకృతి రెండో చేతికే తెలియకూడదంటారు.  దర్పంగా చెప్పుకోరాదు.   8. మన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా జరిగిన గౌరవాన్ని, సన్మానాన్న...

పరోపకారాయ ఫలంతి వృక్షాః - Stotras and Slokas - 6

పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్ధమిదం శరీరమ్ చెట్లు పండ్లను ఇస్తాయి, నదులు తియ్యటి నీటిని ప్రవహింపచేస్తున్నాయి, ఆవులు బలవర్ధకమైన పాలనిస్తున్నాయి, ఎవరూ అడగకుండానే ఇవన్నీ ఇస్తున్నాయంటే పరులకు ఉపకారాన్ని చేయడము కోసమే. అందుకే మన శరీరాన్ని కూడా ఇతరులకు ఉపకారాన్ని చేయడానికే వినియోగించాలి‌ కదా?

కుర్వాణః కృషిమమితాం మితంశయానః - Stotras and Slokas - 5

కుర్వాణః  కృషిమమితాం మితంశయానః భూంజానో మితమమితం పరందదానః జానానో బహువిషయాన్ మితం బ్రువాణః ఉత్కర్షం భువిలభతే సవర్థమానః ఎక్కువగా పనిచెయ్యడము, మితంగా నిద్రపోవడము, మితంగా తినడము, ఇతరులకు పెట్టడము, అనేక విషయాలను తెలిసి ఉండి కూడా మితంగానే మాట్లాడడము...వీటిని ఎవరు చేస్తారో వారు లోకములో వృద్దిలోకి‌ వస్తారు. ఉన్నతస్థితి పొందుతారు.

యః స్పష్ట్వా కురుతే కార్యం - Stotras and Slokas - 4

యః స్పష్ట్వా కురుతే కార్యం ప్రష్టవ్యాన్ స్వహితాన్ గురూన్ నతస్య జాయతే విఘ్నః కశ్మిం శ్చిదపి కర్మణి ఎవరైనా ఒక కార్యాన్ని సాధించ దలచు కున్నప్పుడు, తన‌ మేలు కోరే వారు, సలహా చెప్పదగిన పెద్దలయిన వారిని సంప్రదించాలి. అలా చేస్తే ఆ కార్యమెప్పటికీ చెడిపోదు.

ఆచార్యాత్ పాద మాదత్తే - Stotras and Slokas - 3

ఆచార్యాత్ పాద మాదత్తే పాదం శిష్య: స్వమేధయా పాదం సహచరై  స్సాకమ్ పాదం  కాల క్రమేణ   చ                           వయో నిమిత్తం లేకుండా మనం ఒక విద్యలో  పారంగతులము అవ్వాలంటే దానికి 4 అధ్యయన సోపానాలు ఉన్నాయి. 1. గురువుగారు పాఠం చెప్పగానే  ఒక పావు వంతు మాత్రమే మన బుర్రకెక్కుతుంది. 2. మనం ఏకాగ్రత, శ్రద్ధ, ఆసక్తులతో స్వయంగా  మేథోమథనం  చేయడం వల్ల మరో పావువంతు అవగతమవుతుంది. 3. అధ్యయన శీలురైన  తోటి మిత్రులతో  సాంగోపాంగంగా, కూలంకషంగా చక్కగా చర్చించడం వల్ల మరో పావువంతు అవగాహన అవుతుంది. 4. అలా నేర్చుకున్న విద్యను కాలక్రమేణ నిరంతరం మననం చేసుకొంటూ, పదిమందికి పంచడం ద్వారా  దానిపై  పూర్తి  సాధికారికత, సమగ్రత  సిద్ధిస్తుంది.

విద్యా వివాదాయ ధనం మదాయ - Stotras and Slokas - 2

విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ దుర్మార్గుడు విద్యను వివాదం కొరకు ఉపయోగిస్తాడు. అతని ధనం మదానికి కారణం అవుతుంది. అతని శక్తి ఇతరులను పీడించడానికి ఉపయోగపడుతుంది. సత్పురుషునికి మాత్రం విద్య వల్ల జ్ఞానం కలుగుతుంది, ధనం వల్ల దాతృత్వం అబ్బుతుంది. అతని శక్తి సమాజాన్ని రక్షించడం కోసం ఉపయోగపడుతుంది.

జీర్యంతే జీర్యతః కేశాః - Stotras and Slokas - 1

జీర్యంతే  జీర్యతః  కేశాః దంతాః  జీర్యంతి జీర్యతః జీర్యతః  చక్షుషీ  శ్రోత్రే తృష్ణా ఏకా తరుణాయతే                      మనిషి శైశవ, బాల్య, కౌమార, యౌవన దశలను  జవ సత్త్వాల జోరులో  సంతోషంగా  గడిపి, వృద్ధాప్యంలోకి రాగానే, మన ప్రమేయం లేకుండానే క్రమంగా శిరోజాలు  తెల్లబడి,   రాలిపోతుంటాయి.  కొన్ని టన్నుల ఆహారాన్ని నమలడంలో అలసి, సొలసిన దంతాలు  ఊడి పోతుంటాయి. సమస్త ఇంద్రియాలలో తలమానికమై, జీవితానికే చుక్కాని వంటి  కళ్ళు కనబడని పరిస్థితి దాపురిస్తుంది. ఇష్టమైనా, కష్టమైనా పుంఖాను పుంఖాలుగా ఎన్నో విషయాలు విని, విని    చెవులు వినబడకుండా పోతాయి. కాని మనం పుట్టగానే మనతో పుట్టిన ఆశ మాత్రము కరగని, తరగని  నిత్య నూతన యౌవనంతో  మిస మిసలాడుతున్నది. కాన బాల్యంలో భక్తి బీజాలను అంకురింప జేసుకొని, కౌమారంలో బలపడి, యౌవనంలో స్థిరపడి, పలు క్షేత్రాలు, తీర్ధాలు దర్శించి, ముదిమిలో  ఆశలను విడనాడి, జీవన్ముక్తికి  సాధన చేయాల...