స్మృతులు 18 అంటున్నారు. అవేమిటో తెలియజేస్తారా? ఇవిగాక ధర్మ శాస్త్ర విషయాలను వివరించే గ్రంథాలేమున్నాయి?
సనాతన ధర్మాన్ని సూత్రీకరించే మూల స్మృతులు 18. వాటి పేర్లు ఇవి. 01. మనుస్మృతి, 02. బృహస్పతి స్మృతి, 03. వశిష్ఠ స్మృతి, 04. కశ్యప స్మృతి, 05. భారద్వాజ స్మృతి, 06. గౌతమ స్మృతి, 07. యాజ్ఞవల్క్య స్మృతి, 08. భృగు స్మృతి, 09. నారద స్మృతి, 10. కపిల స్మృతి, 11. పరాశర స్మృతి, 12. వ్యాస స్మృతి, 13. కాత్యాయన స్మృతి, 14. ఆపస్తంభ స్మృతి, 15. అశ్వలాయన స్మృతి, 16. కణ్వ స్మృతి, 17. అత్రి స్మృతి, 18. హరీత స్మృతి. ఇవి గాక శంఖ స్మృతి, మున్నగు స్మృతులు, ఉప స్మృతులు కూడ ఉన్నాయి. ఈ స్మృతులననుసరించి కూర్చబడిన ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవి. 01. హేమాద్రి, 02. నిర్ణయ సింధువు, 03. ధర్మ సింధువు, 04. ధర్మ ప్రవృత్తి, 05. స్మృతి రత్నాకరం, 06. స్మృతి రత్న మహోదధి, 07. స్మృతి చంద్రిక, 08. షట్కర్మ చంద్రిక, 09. యల్లాజీయము, 10. సుధీవిలోచనము మున్నగునవి.