ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?

సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది.

అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు.

ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం నిద్రలేవడంతోటే దణ్ణం పెట్టుకొని, పనికి వెళ్ళండి. వృత్తిలో రాణిస్తారు. రాత్రి పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. మంచి నిద్రపడుతుంది. ఏ ఆందోళనలూ ఉండవు. దేవుని పట్ల విశ్వాసం తర్కానికి అందదు. అచంచల విశ్వాసమే మనిషిని మనీషిని చేసే మంత్రదండం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

రోజువారీ జీవితంలో భక్తి: ఆనందం, ప్రశాంతతకు చిట్కాలు (Devotion in Daily Life: Tips for Joy and Peace)

 నమస్కారం! ఈ ఆధునిక యుగంలో, మన జీవితాలు ఎంత వేగంగా పరుగులు పెడుతున్నాయో మనందరికీ తెలిసిందే. కుటుంబం, ఉద్యోగం, బాధ్యతలు... వీటి మధ్య మనసుకు కాస్త ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం ఎంతో అవసరం. గతంలో భక్తి అంటే గుడికి వెళ్లడం, పూజలు చేయడమే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు, భక్తి మార్గంలో కూడా కొత్త పోకడలు వచ్చాయి. 40 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న మనలాంటి వారికి ఇవి మరింత సౌలభ్యం, లోతైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, ప్రస్తుత ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక భావనలు, వాటిని మన దైనందిన జీవితంలో ఎలా అలవరచుకోవచ్చో చూద్దాం. 1. డిజిటల్ భక్తి: టెక్నాలజీతో అనుసంధానం మనం నిత్యం చూస్తున్నదే ఇది! ఇప్పుడు భక్తి కేవలం దేవాలయాలకు పరిమితం కావడం లేదు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా మనకు నచ్చిన ఆధ్యాత్మిక కంటెంట్‌ని సులభంగా పొందగలుగుతున్నాం. ఆన్‌లైన్ ప్రవచనాలు, భజనలు: యూట్యూబ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ప్రముఖ గురువుల ప్రవచనాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, కీర్తనలు, భజనలు ఎప్పుడైనా, ఎక్కడైనా వినవచ్చు. ఉదయం వాకింగ్ చేస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇవి మనసుకు ఎంతో ఉ...

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...