ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మంచి మాట లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పొరపాటు, సవరణ - మంచిమాటలు

 మనం జీవితంలో చేసే ఓ పొరపాటు మన గౌరవాన్ని నాశనం చేయవచ్చు. కానీ మనం తప్పు చేశామని గ్రహించ గలిగితే, దాన్ని సవరించి మన వ్యక్తిత్వానికి వన్నె పెట్టుకో గలుగుతాము. అందుకు ముందుగా మనం మన తప్పుని గ్రహించాలి. తర్వాత దాన్ని అంగీకరించాలి. మనం నేరుగా వారికి ఆ విషయం చెప్పడానికి మన అహం అడ్డు వస్తే, భగవంతుడి ముందు కూర్చుని మనస్ఫూర్తిగా మన తప్పును ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన తప్పు వల్ల ఎవరు బాధితులు అయ్యారో వారికి నష్ట పరిహారం చెల్లించాలి. అసలు తప్పు చేయని వారిని ప్రపంచం విస్మరిస్తుంది. కానీ తప్పు చేసి దాన్ని అంగీకరించి, చివరికి ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడిని ప్రపంచం మర్చిపోదు. "శుభం భూయాత్"

ప్రదేశం మారితే లాభం లేదు. ఏ విషయంలోనైనా మారాల్సింది మనిషి బుద్ధే. - మంచిమాటలు

 ప్రదేశం మారితే లాభం లేదు. ఏ విషయంలోనైనా మారాల్సింది మనిషి బుద్ధే. దైవ ప్రార్థన ఏకాంతంగా చేయాలి. ప్రార్థన అనేది మెదడులోంచి కాక హృదయంలోంచి వస్తేనే అది టూ వే సంభాషణ అవుతుంది. అది దేవుడికీ, మనకు సంబంధించినది తప్ప, మనకు ప్రపంచంలోని ఇతరులకి సంబంధించినది కాదు. శిక్ష పడుతుందన్న భయంతో కానీ, బహుమతి లభిస్తుందన్న ఆశతో కానీ దేవుడ్ని కొలవడం తప్పు. దేవుడ్ని చేరుకోవడానికి మాత్రమే కొలవాలి. ఆధ్యాత్మిక వివేచనతో మేలైన వివేకం అలవరచుకుంటే ఆటవికులు కూడా జ్ఞానులైన యోగులవుతారు. స్పష్టమైన జ్ఞాన నియంత్రణలో ఇంద్రియాలు సులువుగా, ఆనందంగా మన అధీనంలోకి వస్తాయి. అప్పుడు మనకు ప్రతిగా కాక మనకు అనుకూలంగా ప్రవర్తిస్తాయి. విలువలే మన ప్రవర్తనకు పునాదిరాళ్ళు. మన సంస్కృతికి సమగ్ర భాగస్థులు. మన విలువలు దృఢంగా ఉంటే మనకు తప్పు, ఒప్పులు సులువుగా తెలుస్తాయి. తదనుగుణంగా మనం క్రియాత్మకులం కావచ్చు.

ఇచ్చేవాడికంటే పుచ్చుకునే వాడే గొప్ప - మంచిమాటలు

ప్రాపంచిక వ్యామోహాలు, సుఖాలు అనే మురికి బట్టలని వదిలి, శాశ్వత సుఖం లేదా మోక్షం కోసం సదా ప్రయత్నం చేయాలి. ఇచ్చేవాడికంటే పుచ్చుకునే వాడే గొప్ప. మన నుంచి దానం పుచ్చుకొనే వారి వల్లే మనకు పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం, తద్వారా ఉత్తమ గతి పొందే అవకాశం మనకు కలుగుతాయి. మనకు ఆ అవకాశాన్ని కల్గించినందుకు దానం పుచ్చుకున్న వారికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి. మనకు కేటాయించబడిన ఎంత చిన్న పనైనా సరే శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధ చేస్తే అందువల్ల మనకే గాక ఇతరులకి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. మనం చేసే దుష్కర్మలు కొన్ని వెంటనే, త్వరగా ఫలితాలను ఇస్తే, మరికొన్ని కొంత సమయం తీసుకున్నాక ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం చేసే అన్ని పనుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతి మంచితనం, అతిగా దానం చేయడం, అతి పరాక్రమం, తాను గొప్పవాడను అని భావించే వారి దగ్గరకు లక్ష్మీదేవి చేరదు.

వంశానికొక్కడు - మంచి మాటలు

ఈ లోకంలో ఎందరో పుడుతుంటారు, ఎందరో గిడుతుంటారు. కానీ మహనీయులుగా నిలిచేది మాత్రం కొందరే. మన కోసం మనం బతికేది అర్థం లేని జీవితం. మనతోపాటు మరికొందరిని బతికించడం మహనీయత్వం. అలా తన వల్ల తన వంశానికి మంచి పేరు తెచ్చిపెట్టిన వాఏ మహాత్ములు. వారి జీవితమే సార్థకం అని భర్తృహరి తన నీతి శతకంలో ఇలా చెప్తున్నాడు

మంచి పని మనసుకు సంతోషానిస్తే, చెడ్డ పని మనసును నొప్పిస్తుంది - మంచి మాటలు

మంచి పని మనసుకు సంతోషానిస్తే, చెడ్డ పని మనసును నొప్పిస్తుంది. పొగిడే వాళ్ళకంటే ఎక్కువ దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేరు. ఆరోగ్యానికీ, ఆనందానికీ నీతి సూత్రాలే బలమైన పునాదులు. మంచి స్నేహం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నిటినీ ప్రసాదిస్తుంది. మన మాటలకు, చేతలకు తేడా ఉంటే, మనల్ని ఎవరూ ఎప్పటికీ నమ్మరు.

సహనం, పట్టుదల, నిలకడ. - మంచి మాటలు

 జీవితంలో ఉన్నత విలువలు సాధించాలంటే సహనం, పట్టుదల, నిలకడ కావాలి. మనకు ఎవరి వల్లనైనా హాని కలిగితే అది మన మంచికే అని భావించి, బాధను భరించాలి. మనలోని స్థిరత్వాన్ని చూపేందుకు, మనపై మనకు గల విశ్వాసాన్ని ప్రకటించేందుకు ఒక చక్కటి అవకాశాన్ని వారు కలిగించారని వారి ఎడల కృతజ్ఞతను ప్రకటించాలి. ఎటువంటి ఒత్తిడి ఎదురైనా సమతుల్యతను కోల్పోకుండా ఉండగలగడమే మనిషిలోని శక్తికీ, జ్ఞానానికి కొలబద్ద. జీవితంలోని ఆటుపోట్లను సహించేందుకు మనిషికి సమత్వస్థితి, వివేకవంతమైన జ్ఞానం ఆవశ్యకం.

అఖండ శక్తి - మంచి మాట

అఖండశక్తితో మహోన్నతంగా స్థిరంగా నిలబడాలి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనపుడు కూడా మనిషి ధైర్యంగా నెట్టుకు రాగలిగితేనే విజేతగా నిలుస్తాడు. ఆపద కలిగినప్పుడు దాని నుండి పారిపోయి మరియొక సమస్య తెచ్చుకోవడం సరైనది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి. మనం పరమాత్మునితో ఎంతగా సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తి శాలురం అవుతాము, ఇంక అప్పుడు ఏ బలహీనతలూ మనల్ని బాధించలేవు.

మంచి మాటలు

 ఆచార్యుని శ్రీచరణాలయందు ప్రేమ గల వారికి పరమ పదం అర చేత ఉసిరికాయ వంటిది. మన అదృష్టంకొద్దీ మనకు సదాచార్యులు లభిస్తారు. వయస్సు వారికి అంటదు.  <><><><><><><><><><><><><><> ఆచార్యులను లభింప చేసిన భగవంతుని పట్ల నీవు సదా కృతజ్ఞుడవై ఉండాలి. ఆచార్యుడు శిష్యుని ఆత్మను రక్షిస్తాడు, శిష్యుడు ఆచార్యుని భౌతిక శరీరాన్ని కాపాడుకోవాలి.  <><><><><><><><><><><><><><>  ఆచార్యులు దివ్య దేహధారులు. నీ శరీరంలాంటి పాంచభౌతిక శరీరం కాదు వారిది. అందుకే రజః తమో గుణమయమైన మనస్సు కూడ వారికి ఉండదు. అది శుద్ధ సత్వము. <><><><><><><><><><><><><><> "శ్రీమన్నారాయణా!" నీవు ఆశ్రితుల పాపాలను హరించే దయాళుడవు. అందువల్ల నేను నీకు వందనాలు చేసి యాచించేది ఏమిటంటే, నాకు ఏ  జన్మ లభించినా నీ పై తలంపు గలిగేటట్లుగా అనుగ్రహించు. అలాంటి నీ భావన చేత ఎలాగైనా ఈ సంసార ...

పట్టుదల - మంచి మాట

 మన దృష్టిని పట్టుదలగా సరియైన ఆధ్యాత్మిక మార్గంపై నిలిపితే మనల్నెవరూ వెనుకకు మరల్చలేరు. మన సమస్యలను హృదయంలో దుర్బలత్వం లేకుండా ఎదుర్కోవడం నేర్చుకుంటే, మనకు భగవంతుని నుండి అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది. కార్య సాధనకు కావలసిన శక్తి, ఉత్సాహం వస్తాయి. ఎంతటి చేదు అనుభవం అయినా అది మనకు ఎంతో కొంత నేర్పుతుందనే విషయాన్ని సర్వదా జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి అనుభవాలు వచ్చినప్పుడు వాటికి చోటిచ్చి విషాదాలుగా మార్చవద్దు, వాటిని భగవంతుని ఆశీర్వాదాలుగా భావిస్తూ ముందుకు కొనసాగాలి.

ఆచరిద్ధాము

నూరు యజ్ఞాలు చేసిన ఫలితం అన్న దానం, వస్త్ర దానం, విద్యా దానం, గోదానం వల్ల లభిస్తుంది. ఆచార్య దర్శనం సాక్షాత్తు పరమ పద దర్శనం, సఫలమవుతున్న నీ ప్రతి పనీ ఆచార్య కటాక్షమే. దేవాలయ నిర్మాణ సమయంలోనూ, దేవాలయాల్లో భగవంతుడి పూజలకు, విశేష దినములలో అనగా ఆయా దేవాలయాల వద్ద జరుగుతున్న అన్న ప్రసాద వితరణలో మన యధాశక్తి ధన, వస్తు రూపేణా సమర్పణ చేయడం వల్ల లేదా అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల అనేక విధాలుగా మనం శుభ ఫలితాలను పొందుతాము. ప్రతి సంవత్సరం మన పుట్టిన రోజున లేదా పెళ్ళి జరిగిన రోజున లేదా గృహప్రవేశం జరిగిన రోజున శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో ఎటువంటి దోషాలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఉండవు. ఇంట్లో అందరూ సుఖశాంతులతో, మనశ్శాంతిగా కలిసి మెలిసి జీవిస్తారు. ఎంత ప్రయత్నించినా ఎన్ని పరిహారాలు ఆచరించినా కుటుంబ కష్టాలు తీరని వారు సంకటహర చతుర్ధి నాడు వినాయకుడిని గరికతో శ్రద్ధగా పూజించి ఉండ్రాళ్ళు, చెరకురసం నివేదించి ఆ ప్రసాదం స్వీకరించండి. ముందు రోజు అనగా తదియ రోజు రాత్రి కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఈ విధంగా చేయడం వల్ల వినాయకుడు సకల సంకటా...

మంచి మాట - 17

 ప్రయత్నిద్దాం ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లేకపోతే పట్టించుకోకుండా, ప్రశాంతంగా ఉందాం. అంతే కానీ చింతించడం సమస్యను తీర్చదు కదా.

మంచి మాట - 16

ఎక్కువ కావాలి అనుకొనే వారికి అన్నీ కష్టాలే. తక్కువ చాలు అనుకొనే వారికి అన్నీ సుఖాలే.

మంచి మాట - 15

కోపంగా ఉన్నపుడు సమాధానం ఇవ్వవద్దు. నిరాశగా ఉన్నపుడు నిర్ణయాలు తీసుకోవద్దు.

మంచి మాట - 14

ఒకరు మన కోసం మారతారని సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తున్న మారలేదంటే, ఇంక మారాల్సింది వాళ్లు కాదు మనమే మారాలి. మనం అంటే విలువ లేని వారి దగ్గర వాళ్ల కోసం ఆలోచించడం వృధా.

మంచి మాట 13

సందర్భానికి అనుగుణంగా పలికిన మాట, సద్భావంతో ప్రియమైన మాట, తన పౌరుషానికి తగ్గ కోపం ఇవేవీ వృథా కావు.

మంచి మాట 12

నదిని దాటుటకు ఈత అవసరమైనట్లు సంసారమును దాటుటకు బ్రహ్మవిద్య అవసరము. కావున దానిని పొందుటకు మానవుడు ప్రయత్నించవలయును.

మంచి మాట 11

ధనం నుండి గుణం రాదు. ధనం మరియు ఇతర అన్ని మంచి విషయాలు వ్యక్తులకు గుణం నుండే వస్తాయి.

మంచి మాట 10

మన సంపదల్ని మనం శాసించగలిగితేనే మనం నిజమైన, స్వతంత్రులమైన శ్రీమంతులం. కానీ మన సంపద మనల్నే శాసిస్తుంటే, మనం నిజానికి సిరికి సామంతులమే.

మంచి మాట 9

మనిషి ధనాన్ని రూపొందించాడు, కానీ ధనమేమో మనిషిని మతిహీనుడిగా మార్చింది.

మంచి మాట 8

భగవంతుడు ఇస్తాడు, దీవిస్తాడు. మానవుడేమో గ్రహిస్తాడు, మరుస్తాడు. ఏమారుస్తాడు కూడా.