సమాధానం:
ఇది మీ మనస్సాక్షిని మీరు అడగవలసిన ప్రశ్న. ఆపదలలో గట్టెక్కడానికి దేవుడికి మ్రొక్కుకొని, ఆ తర్వాత తీర్చకపోతే మీ మనస్సాక్షి ఊరుకోదు. మిమ్మల్ని అనుక్షణం నిలదీస్తూనే ఉంటుంది. వాగ్ధాన భంగం చేసుకున్న మీరు మానసిక ఒత్తిడికి గురై అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.
అయితే భగవత్ పరంగా చూస్తే, మీ మొక్కుబడికి భగవంతుని ద్వారా మీరు పొందే ఉపశమనానికి సంబంధం ఉండదు. భగవంతుడు మీ ఆర్తిని చూస్తాడేగాని, మీరు మ్రొక్కే మొక్కుబడుల బరువును చూడడు.
మనం భావిస్తున్నట్లుగా, మొక్కుబడుల వల్ల మనకొచ్చే ప్రయోజనాలను, మనం నిష్పత్తులతో లెక్కగట్టి హుండీలో వేసే డబ్బుకు సంబంధంలేదు. ఆలస్యంగానైనా ఏ దేవుడి మొక్కు ఆ దేవుడి వద్దే తీర్చడం మంచిది.
ఇవన్నీ మన సంతృప్తికి, మనం అనుకున్న మాట నెరవేర్చుకోవడం కోసం చేసే కార్యాలే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి