సమాధానం:
"లెక్కలేనంతమంది" అని చెప్పడానికే, ముప్ఫై మూడు కోట్ల దేవతలని, ముక్కోటి దేవతలని అంటారు. అట్లాగే "సహస్ర శీర్ష పురుష" అంటే అసంఖ్యాకమైన తలలు ధరించే శక్తి కలిగిన పురుషోత్తముడనే అర్థం చేసుకోవాలి. కేవలం వెయ్యి తలలు కలిగిన వాడనే అర్థంకాదు. అసలు ముప్పది ముగ్గురు దేవతలనే వేదం చెప్పింది. అయితే వీరు ముప్ఫై మూడు వర్గాలకు చెందిన అనేకమంది దేవతలు. ఎనిమిది మంది వసువులు, పదకొండుమంది రుద్రులు, పన్నెండు మంది ఆధిత్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం ముప్పది ముగ్గురు. దేవతలకు వైద్యులే అశ్వనీ దేవతలు. అందరు దేవతలకంటే అన్ని విధాల అధికుడైన దివ్యతేజోమూర్తినే దేవుడు అని పిలవాలి.
Comments
Post a Comment