సమాధానం:
హయగ్రీవ అవతార కథంతా చెప్పుకుంటేగాని ఈ ధర్మసందేహం తీరదు.
సృష్టి ఆరంభంలో పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని ఉపదేశించాడు. అప్పుడు బ్రహ్మ ఎదుట నాలుగు వేదాలు నలుగురు వేదపురుషులై సాక్షాత్కరించారు. అదే సమయంలో మధుకైటభులనే అసురులు వచ్చారు. వారు బ్రహ్మతో, వేదపురుషులతో తలపడి, నలుగురు వేదపురుషులను బందీలను చేసి రసాతలానికి తీసుకువెళ్ళిపోయారు. బ్రహ్మ వేడుకొనగా, పరమాత్మ రసాతలలోకానికి వెళ్ళి, హయగ్రీవ స్వరూపం ధరించి గట్టిగా సకలించాడట. ఆ ధ్వనికి భయపడి, అసురులు పారిపోగా హయగ్రీవుడు అక్కడున్న నలుగురు వేదపురుషులను జాగ్రత్తగా పైకి తెచ్చి బ్రహ్మకు మళ్ళీ అందించారు.
హయగ్రీవుని సకిలింపు ఉద్గీధం అనే సామవేదగానంలా ఉంటుంది. ఆ తర్వాత ఆ రాక్షసులు విష్ణువుపైకి యుద్ధానికి వెళ్ళి, ప్రాణాలు పోగొట్టుకొన్నారు. హయగ్రీవుడు రూపుదాల్చిన విద్యగా ఆరాధనలందుకుంటున్నాడు.
హయ అంటే అశ్వము, విజ్ఞానము. గ్రీవము అంటే కంఠము. అన్ని రకాల విద్యలు కంఠగతాలై ఉన్న సర్వ విద్యా స్వరూపమే.
గుర్రమువంటి శిరస్సు మానవదేహము కల హయగ్రీవమూర్తిని ఆయన అవతరించిన శ్రావణ పూర్ణిమ రోజున ఆయన్ను ఆరాధిస్తే, నిత్యము ధ్యానిస్తే సర్వవిద్యలను ప్రసాదిస్తాడని భాగవతం, భారతం శాంతి పర్వములోని నారాయణీయము తెలియజేస్తున్నాయి.
జైహయగ్రీవ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి