సమాధానం:
కోరికలు కోరుతూ అయినా దైవానికి ప్రార్థన చేయవచ్చు, తప్పులేదు.
అయితే మనం కోరినవన్నీ భగవంతుడు ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మన యోగ్యతను చూచి ఆయన ఇవ్వతగినవి ఇస్తాడు.
మనం ఏమీ కోరుకోకుండా, ప్రార్థన చేస్తే తన ఔన్నత్యానికి దీటుగా ఔదార్యంతో మనకు ఏం కావాలో పరిశీలించి ఇస్తాడు. ఇదే గోదాదేవి మనకు చెప్పిన పాఠం.
కోరిన దేవతలకు రాక్షసుల నుండి రక్షణ కల్పించాడు. ఏ కోరికలు కోరని ధృవుడికి శాశ్వత స్థానాన్ని ఇచ్చాడు.
అయితే కోరికలు కోరడం, ఆపద మొక్కులు మ్రొక్కడం మానవ నైజం. అలాగే తన భక్తులను ఆదుకోవడం భగవంతుని కృపా విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి