ఆత్మకు పుట్టుకలేదు, చావులేదు అంటారు కదా, మరికొత్త ఆత్మలు సృష్టించడబడకపోతే, ప్రపంచ జనాభా ఎలా పెరిగిపోతున్నది?
సమాధానం: భారతదేశం వంటి కొన్ని దేశాల్లోనే మానవుల సంఖ్య పెరిగిపోతున్నది. కాని జంతుజాలము తరిగిపోతున్నది.
క్రిమికీటకాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అంత వేగంగానే నశించిపోతున్నాయి. వృక్షాలు, పక్షులు తగ్గిపోతున్నాయి.
మనం చేసే కర్మలను బట్టి మనకు జన్మలు లభిస్తాయి. పుణ్యకర్మలు చేస్తే దివ్యపురుషులుగా ఉత్తమలోకాలకు వెళ్తారు. పాపకర్మలు చేస్తే అథో జన్మలు అంటే పాములు, కీటకాలు, మృగాలు వంటివి వస్తాయి.
అందువల్ల ఒక జీవ వర్గంలో సంఖ్య ఎక్కువైతే, ఇంకొక దానిలో జనాభా తగ్గిపోయే అవకాశం ఉన్నది.
అందువల్ల ఆత్మల సంఖ్య పెరిగే అవకాశంలేదు. అన్ని జీవవర్గాల మధ్య సమతుల్యాన్ని ఆ భగవానుడే నిర్వహిస్తాడు.
మనం చేయవలసినదల్లా, మాధవసేవగా సర్వ ప్రాణి కోటి సేవ చేస్తూ, భగవంతుని కరుణా కటాక్షాలకు నోచుకోవడమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి