ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంజనేయస్వామి సముద్రలంఘనం ఘట్టం నుంచి మానవజాతి నేర్చుకోవాల్సినది ఏమైనా ఉందా?

సమాధానం: మన ఇతిహాస పురాణాల్లోంచి మనం నేర్చుకొని పాటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆంజనేయస్వామి సముద్రలంఘనం చేసి, నూరు యోజనాలు దాటి లంక చేరాడు. అలాగే మనం సంసార సాగరాన్ని నూరేళ్ళ ఆయుర్ధాయం లోపల దాటి ఆవలి తీరం చేరాలి. యోగి, సాధకుడు, ఆచార్యుడు అయిన హనుమ తనను తాను రామబాణంతో పోల్చుకున్నాడు. ఇదే కర్మయోగం యొక్క మూలసూత్రం. హనుమ ఈ పనిని తాను చేస్తున్నానని కానీ, ఇది తన కోసమే అని కానీ, ఇది తనది అని కానీ తలవడంలేదు. రామకార్యం కోసం రామబాణంలాగా వెళ్తానంటాడు. ఈ జీవన సూత్రాన్ని మనం పాటించాలి. అంతా నేను, నాది అనే భావం మనలో తగ్గాలి. సముద్రాన్ని దాటడంలో హనుమ నాలుగు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఏ ఆలంబనము లేకుండా అగాథమైన సాగరాన్ని దాటడం, మైనాకుడి అతిధ్యాన్ని సున్నితంగా తిరస్కరించి ఆగకుండా ముందుకు సాగడం, సురస అనే రాక్షసిని ఉపాయంతో జయించడం, సింహిక అనే ఛాయా రాక్షసిని సంహరించడం ఈ పనుల్ని అవలీలగా చేసిన హనుమను దేవతలు ఇలా మెచ్చుకున్నారు.

యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర! యథాతవ
ధృతిర్దృష్టిర్కమతిర్ధాక్ష్యం స్వకర్మ సు నసీదతి


ఓ వానరేంద్రా! నీలా ఎవరికైతే ధైర్యం, పూనిక, గమ్యంపై దృష్టి, వివేకం, యుక్తి, సామర్థ్యం ఉంటాయో అతడు తన పనిలో విజయం సాధిస్తాడు. ఏ కార్యం సాధించాలన్నా మనకు ఉండాల్సిన గుణగణాలే ఇవి. మానవుని జీవితమే రామాయణం. జీవితంలో అడుగడుగునా మనకు పాఠాలు నేర్పే సద్గురువు వాల్మీకి మహర్షి.

శుభంభూయాత్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

హిందూ దేవుళ్ళు: అనంతమైన భక్తికి, అపారమైన జ్ఞానానికి మూలాలు

హిందూ దేవుళ్ళు: అనంతమైన భక్తికి, అపారమైన జ్ఞానానికి మూలాలు DevotionalWaves కు స్వాగతం! మన సనాతన ధర్మం, హిందూ మతం ఎన్నో వేల సంవత్సరాలుగా మానవాళికి ఆధ్యాత్మిక మార్గాన్ని, జీవన విలువలను అందిస్తూ వస్తోంది. ఈ విశాలమైన ధర్మంలో, దేవతలు మరియు దేవతల ఆరాధన ఒక ముఖ్యమైన భాగం. హిందూ దేవుళ్ళు కేవలం విగ్రహాలు కాదు, వారు విశ్వశక్తికి, ప్రకృతి శక్తులకు, మానవ జీవితంలోని వివిధ కోణాలకు ప్రతీకలు. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, హిందూ దేవతల ప్రాముఖ్యతను, వారి వైవిధ్యాన్ని, మరియు వారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే. రాబోయే పోస్ట్‌లలో, మనం ప్రతి దేవుడు/దేవత గురించి లోతుగా, వారి కథలు, విశిష్టతలు, మరియు పూజా విధానాలపై ప్రత్యేకంగా చర్చిస్తాము. హిందూ దేవుళ్ళు ఎవరు? వారి ప్రాముఖ్యత ఏమిటి? హిందూ మతంలో "దేవుడు" అనే భావన చాలా విస్తృతమైనది. ఇది ఏకేశ్వరవాదం (ఒకే దేవుడిని నమ్మడం) మరియు బహుదేవతారాధన (అనేక దేవతలను ఆరాధించడం) రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ వైవిధ్యం హిందూ ధర్మం యొక్క సౌలభ్యాన్ని, లోతైన తాత్వికతను ప్రతిబింబిస్తుంది.   బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (త్రిమూర్తులు)...