Skip to main content

గోవింద అనే పేరు కలియుగంలో కదా వచ్చింది. అయితే ద్వాపరయుగంలో ద్రౌపది గోవిందా అని ఎలా అనగలిగింది?

సమాధానం: 

గోవింద అనే నామం శ్రీకృష్ణుడికి మొదట వరాహావతారంలో భూదేవిని ఉద్ధరించినపుడు తర్వాత ద్వాపర యుగంలోను వచ్చింది.

తనకు హోమ హవిస్సులు ఇవ్వలేదనే కోపంతో, ఇంద్రుడు గోకులంలో రాళ్ళవాన కురిపించి అందరినీ భయభ్రాంతుల్ని చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతం చిటికెన వ్రేలితో గొడుగుగా ఎత్తి, ఆ బాలగోపాలానికి ఆశ్రయం కల్పిస్తాడు. ఏడు రోజుల తర్వాత ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని, కామధేనువుతో కృష్ణుడి వద్దకు వచ్చి, క్షీరాభిషేకం చేస్తాడు. గోవులను, గోపాలురను పొంది ఆనందింపజేసినవాడుగా శ్రీకృష్ణుడికి గోవింద పట్టాభిషేకం జరుగుతుంది. అప్పటి నుండి ఆయన గోవిందుడయ్యాడు.

ఆ తర్వాత ద్రౌపది ఆయన్ను గోవిందా అని పిలిచి శ్రీకృష్ణుని నుండి రక్షణ పొందుతుంది.

ఆ గోవిందనామంతోనే కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని భక్త కోటి ప్రేమతో, ప్రపత్తితో భజిస్తున్నారు. ఎలుగెత్తి గోవిందా, గోవిందా అంటున్నారు.

గోవిందా గోవింద

Comments

Popular posts from this blog

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

విద్యా వివాదాయ ధనం మదాయ - Stotras and Slokas - 2

విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ దుర్మార్గుడు విద్యను వివాదం కొరకు ఉపయోగిస్తాడు. అతని ధనం మదానికి కారణం అవుతుంది. అతని శక్తి ఇతరులను పీడించడానికి ఉపయోగపడుతుంది. సత్పురుషునికి మాత్రం విద్య వల్ల జ్ఞానం కలుగుతుంది, ధనం వల్ల దాతృత్వం అబ్బుతుంది. అతని శక్తి సమాజాన్ని రక్షించడం కోసం ఉపయోగపడుతుంది.

దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?

సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది. అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం న