ఉపనిషత్తులు వేద భాగాలుగా సనాతనాలు. ఇందులో సత్యం భగవన్ముఖోదీరితం. ఈ సత్యం ప్రత్యక్షానుమానాది భౌతిక పరిచ్ఛిన్న ప్రమాణాల ద్వారా తెలుసుకొన్నది కాదు.
మరి, ఋషులు సాక్షాత్తుగా దర్శించినది. మన ప్రత్యక్షానుభవంకంటే ఋషుల దర్శనానుభవం నిర్దుష్టం, ప్రామాణికం, వాస్తవం, దివ్యమూను.
యాస్కుల వారు "సాక్షాత్కృత ధర్మాణః" అంటారు ఋషులని. వారి ప్రయత్నం లేకుండానే వారి ఎదలలో భాసించే దివ్య సత్యం ఇది. "పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం" అంటారు శ్రీశంకరులు ఈ సత్యాన్ని.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి