ప్రాపంచిక వ్యామోహాలు, సుఖాలు అనే మురికి బట్టలని వదిలి, శాశ్వత సుఖం లేదా మోక్షం కోసం సదా ప్రయత్నం చేయాలి.
ఇచ్చేవాడికంటే పుచ్చుకునే వాడే గొప్ప. మన నుంచి దానం పుచ్చుకొనే వారి వల్లే మనకు పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం, తద్వారా ఉత్తమ గతి పొందే అవకాశం మనకు కలుగుతాయి. మనకు ఆ అవకాశాన్ని కల్గించినందుకు దానం పుచ్చుకున్న వారికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి.
మనకు కేటాయించబడిన ఎంత చిన్న పనైనా సరే శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధ చేస్తే అందువల్ల మనకే గాక ఇతరులకి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది.
మనం చేసే దుష్కర్మలు కొన్ని వెంటనే, త్వరగా ఫలితాలను ఇస్తే, మరికొన్ని కొంత సమయం తీసుకున్నాక ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం చేసే అన్ని పనుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
అతి మంచితనం, అతిగా దానం చేయడం, అతి పరాక్రమం, తాను గొప్పవాడను అని భావించే వారి దగ్గరకు లక్ష్మీదేవి చేరదు.
భక్తి మార్గంలో తొలి అడుగులు వేయడానికి మా వెబ్సైట్ మీకు ఆదర్శ వేదిక.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి