ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాల్లో ఉన్న విగ్రహమూర్తులను "షడ్ బేరములు" అని అంటారు.
అవి ధృవబేరము (మూర్తి), కౌతుక బేరము, స్నపన బేరము, బలిబేరము, యాత్రాబేరము, శయన బేరములు.
గర్భగుడిలో ఉండే మూలవిరాట్టునే ధృవ (కదలిక లేని) బేరము అంటారు. ధృవ బేరం పరిపూర్ణ తేజస్సు కలిగి సకల కళాపూర్ణంగా ఉంటుంది. స్నపన బేరం నిత్యమూ అభిషేకానికి ఉపయోగిస్తారు. నివేదన అయిన తర్వాత, బలిహరణ్ నివేదనను ధ్వజ స్తంభం దగ్గర, బలిపీఠాల దగ్గర, పరివార దేవతలకు తప్పకుండా పెట్టాలి.
అప్పుడు పల్లకీలో వెళ్ళే దేవుడిని బలిబేరం అంటారు. ఆలయంలో, గ్రామ వీధుల్లోను ఊరేగింపుగా తీసుకు వెళ్ళే విగ్రహమూర్తులను యాత్రాబేరం అంటారు. నిత్యమూ పవళింపు సేవ చేయడానికి వినియోగించే మూర్తిని శయన బేరం అంటారు.
కౌతుకబేరాన్ని మధ్యవర్తిగా వినియోగిస్తారు. అంటే తిరుమంజనం (స్నానం) సమర్పించే ముందు ధృవ బేరంలోని కళాశక్తిని కౌతుక బేరం ద్వారా స్నపన బేరంలో ప్రవేశింపజేసి, ఆ ఉపచారం పూర్తి కాగానే ఆ శక్తిని తిరిగి కౌతుక బేరం ద్వారానే ధృవమూర్తిలోకి మారుస్తారు.
ఇలాగే ఇతర ఉపచారాల్లో కూడ చేస్తారు. అయితే సాధారణంగా ఎంత చిన్న ఆలయంలో అయినా ధృవమూర్తి, ఉత్సవమూర్తులు తప్పక ఉంటారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి