మనం జీవితంలో చేసే ఓ పొరపాటు మన గౌరవాన్ని నాశనం చేయవచ్చు. కానీ మనం తప్పు చేశామని గ్రహించ గలిగితే, దాన్ని సవరించి మన వ్యక్తిత్వానికి వన్నె పెట్టుకో గలుగుతాము.
అందుకు ముందుగా మనం మన తప్పుని గ్రహించాలి. తర్వాత దాన్ని అంగీకరించాలి. మనం నేరుగా వారికి ఆ విషయం చెప్పడానికి మన అహం అడ్డు వస్తే, భగవంతుడి ముందు కూర్చుని మనస్ఫూర్తిగా మన తప్పును ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన తప్పు వల్ల ఎవరు బాధితులు అయ్యారో వారికి నష్ట పరిహారం చెల్లించాలి.
అసలు తప్పు చేయని వారిని ప్రపంచం విస్మరిస్తుంది. కానీ తప్పు చేసి దాన్ని అంగీకరించి, చివరికి ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడిని ప్రపంచం మర్చిపోదు.
"శుభం భూయాత్"
శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం. విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు. 2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు. 3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు. 4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు. 5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు. 6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి