ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"దైవ దృష్టితో ఆధ్యాత్మిక ప్రగతిని పొందడం ఎలా? - మంచి మాట

 మనం మన దృష్టిని సదా ఆ దైవం మీద ఉంచితే మనం సూటిగా ఆయన్ని చేరుకుంటాము. అలా కాక దృష్టిని పక్కవాటి వైపు మళ్ళిస్తే దారి తప్పుతాము. కాబట్టి మన గమ్యం సదా ఆ పరమత్మే అయి ఉండాలి.

మనది పోకూడదు అనుకోవడం లోభం. ఇతరులకు చెందింది మనకు రావాలని కోరుకోవడమే స్వార్థం. ఈ రెండూ మనిషికి ఆధ్యాత్మికంగా చెరుపు చేస్తాయి.

మనలో ఎక్కువమంది బహుమతుల వెంటపడి, దేవుడి వైపు వీపుని పెడుతుంటారు. దేవుడి బహుమతులను కాక, దేవుడిని పొందాలన్నది మన ధ్యేయం అయి ఉండాలి.

బాధపడే వాడిని చూసి సహాయం చేయడానికి పరుగెత్తే కాళ్ళు, అతనికి స్వాంతనని ఇవ్వడానికి చాచే చేతులు, అతని బాధని చూసి దయతో కన్నీళ్ళు కార్చే కళ్ళు, అతని బాధని తగ్గించే విధంగా మాట్లాడే నాలుక గలవాడే నిజంగా దేవుడు ప్రేమించే మనిషి. ఎందుకంటే దేవుడ్ని ప్రేమించే వాడే ఆ విధంగా ప్రవర్తించగలడు. అలాంటి వాడంటేనే దేవుడికి ఇష్టం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...

వివాహ సమయంలో సప్తపది అంటారు. దీని పూర్వాపరాలు తెలియజేయండి

 "సఖ్యం సాప్తపదీనం" అనేది ఒక శాస్త్ర సూత్రం. అంటే ఏడడుగులు కలిసి ప్రయాణం చేస్తే వారిద్దరికీ స్నేహం కుదురుతుంది - అని భావం. ఈ సూత్రాన్ని తీసుకుని ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క సంకల్పాన్ని జోడించి, వధూవరులిద్దరి చేత సంయుక్తంగా ఏడడుగులు వేయించే వేదోక్త ప్రక్రియే సప్తపది.