ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మంచి పని మనసుకు సంతోషానిస్తే, చెడ్డ పని మనసును నొప్పిస్తుంది - మంచి మాటలు

మంచి పని మనసుకు సంతోషానిస్తే, చెడ్డ పని మనసును నొప్పిస్తుంది.

పొగిడే వాళ్ళకంటే ఎక్కువ దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేరు.

ఆరోగ్యానికీ, ఆనందానికీ నీతి సూత్రాలే బలమైన పునాదులు.

మంచి స్నేహం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నిటినీ ప్రసాదిస్తుంది.

మన మాటలకు, చేతలకు తేడా ఉంటే, మనల్ని ఎవరూ ఎప్పటికీ నమ్మరు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

నరసింహ అవతారం: భక్తికి, ధర్మానికి ప్రతీక (Narasimha Avataram: A Symbol of Devotion and Dharma)

నరసింహ అవతారం: భక్తి మరియు ధర్మ సంరక్షణకు ప్రతీక విష్ణువు దశావతారాలలో నరసింహ అవతారం చాలా ప్రత్యేకమైనది, ఉగ్రమైనది. ఈ అవతారం భక్తుల పట్ల భగవంతుని అపారమైన ప్రేమను, దుర్మార్గుల పట్ల ఆయనకున్న కఠినత్వాన్ని, మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ఏ రూపంలోనైనా ఆయన అవతరించగలడని చాటిచెప్తుంది. తెలుగువారికి నరసింహస్వామి అంటే అపారమైన భక్తి. మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, అహోబిలం, మంగళగిరి వంటి ఎన్నో ప్రసిద్ధ నరసింహ ఆలయాలు ఉన్నాయి. ఈ కథ కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు, ఇది ధర్మం, భక్తి, మరియు శరణాగతి యొక్క శక్తిని తెలియజేసే ఒక గొప్ప సందేశం. ఈ వ్యాసంలో, నరసింహావతార కథ యొక్క లోతైన అర్థాన్ని, దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. హిరణ్యకశిపుని వరం: అహంకారానికి నాంది పూర్వం కశ్యప మహర్షికి, దితి అనే రాక్షస స్త్రీకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిలో హిరణ్యాక్షుడు వరాహావతారంలో విష్ణువు చేతిలో సంహరింపబడతాడు. తన సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక అసాధారణమైన వరం పొందుతాడు. ఆ వరంలో కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి: అతను మనిషి చేత ...