ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్గశిరమాసంలో ముహూర్తములు - జనవరి - 2021

ఈ జనవరి నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, చంద్రబలం, మీ తారబలం, గురుబలం, గోచారబలం, దశబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ. ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఇవ్వడం జరిగినది. * మార్గశిర మాసం * 01 - జనవరి - 2021 శుక్రవారం ప్రతిష్టతలకు డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు ) అక్షరాభ్యాసలకు అన్నప్రాసనకు రిజిస్ట్రేషన్లకు అగ్రిమెంట్లకు విద్యా, వ్యాపార ప్రారంభాదులకు 03 - జనవరి - 2021 ఆదివారం ఉపనయనం సీమంతాలకు ప్రతిష్టతలకు నిశ్చయ తాంబులాదులు బిడ్డను ఉయ్యాలో వేయుటకు అక్షరాభ్యాసలకు అన్నప్రాసనకు పెండ్లి చూపులకు రిజిస్ట్రేషన్లక...

మౌఢ్యమి అంటే ఏంటి.?

నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నవగ్రహాలలో భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి అది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాకపోతే మనం ఈ భూమ్మీద ఉన్నాం కాబట్టి నవ గ్రహాలలో ఈ భూమిని చేర్చకుండా సూర్యుని వాటిలో చేర్చారు మన పంచాంగకర్తలు. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీనినే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రునికి శక్తిహీనతే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య, గురు గ్రహ శక్తిహీనతను గురు మౌడ్యమి గానూ, శుక్ర గ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీనినే వ్యవహారిక భాషలో మూఢమి అని అంటారు. మౌడ్యమి ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదు.

మౌనం ఒక మంత్రం

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం *మంత్రౌషథ   సమాగమాః * దాన మానా వమానాశ్చ నవ గోప్యాః  మనీషిభిః                       మనిషి అంటే సామాన్య మానవుడు. మనీషి అంటే ఉదాత్త మానవుడు. అలాంటి వారు 9 విషయాలలో గోప్యతను పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆవేమనగా  1. మన ఆయుష్షు మనకు తెలియదు. ఒక వేళ సిద్ధులు, యోగుల వలన తెలిసినా ఆడంబరంగా చెప్పుకోకూడదు. 2. మన నగ నట్రా, పొలాలు, స్థలాలు, నిధి నిక్షేపాలు పరులకు చెప్పరాదు.   3.ఇంటిగుట్టు గుట్టుగానే ఉంచాలి. రచ్చ చేయరాదు.  4. తేలు, పాము, విశేష మంత్రాలతో రోగులకు సేవ చేయవచ్చు. కాని ఆ మంత్రం వెల్లడించరాదు.   5. అలాగే దివ్యౌషథంతో రోగాలు నయం చేయవచ్చు కాని దాని మర్మం విప్పరాదు.   6.కీలక వ్యక్తులతో చేసిన మంతనాలను, చర్చలను బట్టబయలు చేయరాదు. ప్రాణాలకే ముప్పు రావచ్చు. 7.మనం చేసిన దానం, ధర్మం, ఉపకృతి రెండో చేతికే తెలియకూడదంటారు.  దర్పంగా చెప్పుకోరాదు.   8. మన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా జరిగిన గౌరవాన్ని, సన్మానాన్న...

మంచి మాట - 16

ఎక్కువ కావాలి అనుకొనే వారికి అన్నీ కష్టాలే. తక్కువ చాలు అనుకొనే వారికి అన్నీ సుఖాలే.

మంచి మాట - 15

కోపంగా ఉన్నపుడు సమాధానం ఇవ్వవద్దు. నిరాశగా ఉన్నపుడు నిర్ణయాలు తీసుకోవద్దు.

జీవితమే మనకొక పరీక్ష

జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం. పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి? పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది. బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి. బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు. చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. పక్షికి తుపాను పరీక్ష, పాముకు గద్ద పరీక్ష! పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి దేవుడు పరీక్షలు పెట్టడు. మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.

మంచి మాట - 14

ఒకరు మన కోసం మారతారని సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తున్న మారలేదంటే, ఇంక మారాల్సింది వాళ్లు కాదు మనమే మారాలి. మనం అంటే విలువ లేని వారి దగ్గర వాళ్ల కోసం ఆలోచించడం వృధా.