ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పట్టుదల - మంచి మాట

 మన దృష్టిని పట్టుదలగా సరియైన ఆధ్యాత్మిక మార్గంపై నిలిపితే మనల్నెవరూ వెనుకకు మరల్చలేరు. మన సమస్యలను హృదయంలో దుర్బలత్వం లేకుండా ఎదుర్కోవడం నేర్చుకుంటే, మనకు భగవంతుని నుండి అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది. కార్య సాధనకు కావలసిన శక్తి, ఉత్సాహం వస్తాయి. ఎంతటి చేదు అనుభవం అయినా అది మనకు ఎంతో కొంత నేర్పుతుందనే విషయాన్ని సర్వదా జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి అనుభవాలు వచ్చినప్పుడు వాటికి చోటిచ్చి విషాదాలుగా మార్చవద్దు, వాటిని భగవంతుని ఆశీర్వాదాలుగా భావిస్తూ ముందుకు కొనసాగాలి.

భగవన్నిశ్వసనం వేదాలు

 మనపై ప్రసరించి మనను ప్రభోదించి ప్రభావితం చేసే ఈశ్వరుని నిశ్వాసం వేదాలు. "యస్య నిశ్వసితం వేదాః" ఊపిరి ఉనికికి ఉత్ప్రేక్షకం. ఆయన ఉనికిని నిరూపించటంతో పాటు జాతికి ప్రాణవాయువును ప్రసాదించి జన్మకు చారితార్థ్యాన్ని ప్రతిపాదించేది ఈ నిశ్వసనం. ఊపిరి ఆగిపోతే ఉనికే సమసిపోతుంది. అందుకే భగవత్ సత్తను సందేహించే వారికంటే వేదాల ప్రామాణ్యాన్ని శంకించే వారినే మన వారు తీవ్రంగా పరిగణించేరు. వారినే నాస్తికులన్నారు, బాహ్యులన్నారు. ఈ నిశ్వాసాన్ని ప్రకృష్టంగా సమాకర్షించుకొన్నవారు, సమార్జించుకొన్నవారు ఋషులు. వారి ఎదలలో సునిక్షిప్తమైన ఈ నిశ్వాసమే దివ్యజ్ఞానాన్ని కల్గించి, దివ్య దర్శనాన్ని ప్రసాదించింది. అంచేతే వారి దర్శనం, వారి అనుభవం "పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం" అన్నారు మన పెద్దలు.

రామకోటి రాయడానికి నియమాలు | ధర్మ సందేహాలు - సమాధానాలు

    రామకోటి రాయడానికి నియమాలు | ధర్మ సందేహాలు - సమాధానాలు By Sri Hanuman Astrology నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు శ్రీహనుమాన్ జ్యోతీషాలయం జ్యోతీషం మరియు ఆధ్యాత్మిక నిలయం. Sri Prasannanjaneya Swami Temple Venkataramaiah Colony Medchal Rangareddy - 501401  

ప్రేమకు, భక్తికి సంబంధం

పరమాత్మపై పరమ ప్రేమ రూపమైనదే భక్తి అని దేవర్షి నారదుని నిర్వచనం. ఆ మహర్షి రచించిన 84 భక్తి సూత్రాలు, వాటిపై వ్యాఖ్యానం ప్రేమ రూపమైన భక్తిని గురించే కావడం విశేషం. భక్తి అంటే ఏమిటి? భగవంతునిపై అనన్యరూపమైన ప్రేమ కలిగి ఉండడమే భక్తి. అది కర్మ, జ్ఞానం మొదలగు వాని ఆశ్రయం లేకుండా ఉండాలి. ఇతర విషయాలపై స్పృహ లేకుండా చిత్తం అనన్య భావంతో కేవలం భగవంతుని పైనే లగ్నం కావాలి. ఇహ లోకంలోని సమస్త సుఖాల నుండి, పరలోకంలోని సమస్త సుఖాల నుండి దూరమైనా, చివరకు భగవానుని పైననే లగ్నమైన చిత్త వృత్తి ఉండాలి. ఇతర పదార్థాలపై గల మమతల నుండి, ఆసక్తుల నుండి మరలి సర్వ కాల సర్వావస్థల్లో సకల కల్యాణకరుడైన, ప్రియతముడైన భగవానుని పైనే హృదయం నిలపాలి. దానినే అనన్య ప్రేమ అంటారు. "అమృత స్వరూపాచ" అంటారు మూడవ భక్తి సూత్రంలో నారద మహర్షి. అటువంటి అనన్య ప్రేమ అమృత స్వరూపమైనది. ఈ ప్రేమామృతం లభించిన భక్తుడు, దానిని త్రాగి అమరుడవుతాడు. లౌకిక వాసనలే (సంస్కారాలే) మృత్యువు. భక్తుని హృదయంలో నిత్య నూతనమైన పవిత్ర ప్రేమ సంస్కారం తప్ప మరి ఒకటి ఉండదు. ఈ సంస్కారబలంతో భగవానుని లీలానుభవాన్నే సాధనంగా చేసుకొని భక్తుడు జనన్ మరణ సంసార చక్రము నుండి...

రాశి ఫలితాలు మరియు పరిహారాలు 23-02-2025 నుండి 01-03-2025 వరకు Vaara Phalalu

  రాశి ఫలితాలు మరియు పరిహారాలు 23-02-2025 నుండి 01-03-2025     మేష రాశి , వృషభ రాశి , మిథున రాశి , కర్కాటక రాశి , సింహ రాశి , కన్య రాశి , తుల రాశి , వృశ్చిక రాశి , ధనుస్సు రాశి , మకర రాశి , కుంభ రాశి , మీన  రాశి ఫలితాలు మరియు పరిహారాలు 23-02-2025 నుండి 01-03-2025 వరకు రాశి ఫలాలు | February 23rd 2025 to March 01st 2025 Vaara Phalalu By Sri Hanuman Astrology | Weekly Rasi Phalalu | అన్ని రాశుల వారికి వార ఫలాలు డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు శ్రీహనుమాన్ జ్యోతీషాలయం జ్యోతీషం మరియు ఆధ్యాత్మిక నిలయం. Sri Prasannanjaneya Swami Temple Venkataramaiah Colony Medchal Rangareddy - 501401 #రాశిఫలితాలు #RasiPhalalu #Astrology #SriHanumanAstrology #WeeklyVaaraPhalalu #Astro #Horoscope #Telugu #zodiac signs Thanks for watching. Please Like Share & Comment. If you likes our videos please subscribe for more Videos.

ఆలయాలలో, దేవుని సన్నిధిలో ఇతరులకు నమస్కారం పెట్టరాదంటారు, ఎందువల్ల?

దేవుడు, సద్గువులైన యతీశ్వరులు, ఇలాంటి వారు త్రిజగత్ప్రభువులు. వారి సన్నిధిలో ఇతరులంతా దాసులే. చక్రవర్తి సన్నిధిలో ఉండగా, దాసుల దృష్టి చక్రవర్తి మీద కేంద్రీ కృతం కావాలి గానీ, పక్కనున్న దాసుల మీద కాదు. పక్కనున్న దాసుల మీద దృష్టి పెట్టి వారిని గౌరవించడం చక్రవర్తికి అవమానం చేసినట్లే అవుతుంది. దైవ సన్నిధిలో ఇతరులకు నమస్కారం చేయటం గూడా అలాంటిదే. అందువలన దానిని ధర్మశాస్త్రాలు నిషేధించాయి.  

ఆచరిద్ధాము

నూరు యజ్ఞాలు చేసిన ఫలితం అన్న దానం, వస్త్ర దానం, విద్యా దానం, గోదానం వల్ల లభిస్తుంది. ఆచార్య దర్శనం సాక్షాత్తు పరమ పద దర్శనం, సఫలమవుతున్న నీ ప్రతి పనీ ఆచార్య కటాక్షమే. దేవాలయ నిర్మాణ సమయంలోనూ, దేవాలయాల్లో భగవంతుడి పూజలకు, విశేష దినములలో అనగా ఆయా దేవాలయాల వద్ద జరుగుతున్న అన్న ప్రసాద వితరణలో మన యధాశక్తి ధన, వస్తు రూపేణా సమర్పణ చేయడం వల్ల లేదా అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల అనేక విధాలుగా మనం శుభ ఫలితాలను పొందుతాము. ప్రతి సంవత్సరం మన పుట్టిన రోజున లేదా పెళ్ళి జరిగిన రోజున లేదా గృహప్రవేశం జరిగిన రోజున శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో ఎటువంటి దోషాలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఉండవు. ఇంట్లో అందరూ సుఖశాంతులతో, మనశ్శాంతిగా కలిసి మెలిసి జీవిస్తారు. ఎంత ప్రయత్నించినా ఎన్ని పరిహారాలు ఆచరించినా కుటుంబ కష్టాలు తీరని వారు సంకటహర చతుర్ధి నాడు వినాయకుడిని గరికతో శ్రద్ధగా పూజించి ఉండ్రాళ్ళు, చెరకురసం నివేదించి ఆ ప్రసాదం స్వీకరించండి. ముందు రోజు అనగా తదియ రోజు రాత్రి కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఈ విధంగా చేయడం వల్ల వినాయకుడు సకల సంకటా...