ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పొరపాటు, సవరణ - మంచిమాటలు

 మనం జీవితంలో చేసే ఓ పొరపాటు మన గౌరవాన్ని నాశనం చేయవచ్చు. కానీ మనం తప్పు చేశామని గ్రహించ గలిగితే, దాన్ని సవరించి మన వ్యక్తిత్వానికి వన్నె పెట్టుకో గలుగుతాము. అందుకు ముందుగా మనం మన తప్పుని గ్రహించాలి. తర్వాత దాన్ని అంగీకరించాలి. మనం నేరుగా వారికి ఆ విషయం చెప్పడానికి మన అహం అడ్డు వస్తే, భగవంతుడి ముందు కూర్చుని మనస్ఫూర్తిగా మన తప్పును ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన తప్పు వల్ల ఎవరు బాధితులు అయ్యారో వారికి నష్ట పరిహారం చెల్లించాలి. అసలు తప్పు చేయని వారిని ప్రపంచం విస్మరిస్తుంది. కానీ తప్పు చేసి దాన్ని అంగీకరించి, చివరికి ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడిని ప్రపంచం మర్చిపోదు. "శుభం భూయాత్"

స్మృతులు 18 అంటున్నారు. అవేమిటో తెలియజేస్తారా? ఇవిగాక ధర్మ శాస్త్ర విషయాలను వివరించే గ్రంథాలేమున్నాయి?

 సనాతన ధర్మాన్ని సూత్రీకరించే మూల స్మృతులు 18. వాటి పేర్లు ఇవి. 01. మనుస్మృతి, 02. బృహస్పతి స్మృతి, 03. వశిష్ఠ స్మృతి, 04. కశ్యప స్మృతి, 05. భారద్వాజ స్మృతి, 06. గౌతమ స్మృతి, 07. యాజ్ఞవల్క్య స్మృతి, 08. భృగు స్మృతి, 09. నారద స్మృతి, 10. కపిల స్మృతి, 11. పరాశర స్మృతి, 12. వ్యాస స్మృతి, 13. కాత్యాయన స్మృతి,   14. ఆపస్తంభ స్మృతి, 15. అశ్వలాయన స్మృతి, 16. కణ్వ స్మృతి, 17. అత్రి స్మృతి, 18. హరీత స్మృతి. ఇవి గాక శంఖ స్మృతి, మున్నగు స్మృతులు,   ఉప స్మృతులు కూడ ఉన్నాయి. ఈ స్మృతులననుసరించి కూర్చబడిన ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవి. 01. హేమాద్రి, 02. నిర్ణయ సింధువు, 03. ధర్మ సింధువు, 04. ధర్మ ప్రవృత్తి, 05. స్మృతి రత్నాకరం, 06. స్మృతి రత్న మహోదధి, 07. స్మృతి చంద్రిక, 08. షట్కర్మ చంద్రిక, 09. యల్లాజీయము, 10. సుధీవిలోచనము మున్నగునవి.

ఆలయాల్లో మూలవిరాట్టుగాక ఇంకా అనేక విగ్రహాలను చూస్తున్నాం. అవన్నీ ఏమిటో, ఎందుకో వివరించండి

ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాల్లో ఉన్న విగ్రహమూర్తులను "షడ్ బేరములు" అని అంటారు. అవి ధృవబేరము (మూర్తి), కౌతుక బేరము, స్నపన బేరము, బలిబేరము, యాత్రాబేరము, శయన బేరములు. గర్భగుడిలో ఉండే మూలవిరాట్టునే ధృవ (కదలిక లేని) బేరము అంటారు. ధృవ బేరం పరిపూర్ణ తేజస్సు కలిగి సకల కళాపూర్ణంగా ఉంటుంది. స్నపన బేరం నిత్యమూ అభిషేకానికి ఉపయోగిస్తారు. నివేదన అయిన తర్వాత, బలిహరణ్ నివేదనను ధ్వజ స్తంభం దగ్గర, బలిపీఠాల దగ్గర, పరివార దేవతలకు తప్పకుండా పెట్టాలి. అప్పుడు పల్లకీలో వెళ్ళే దేవుడిని బలిబేరం అంటారు. ఆలయంలో, గ్రామ వీధుల్లోను ఊరేగింపుగా తీసుకు వెళ్ళే విగ్రహమూర్తులను యాత్రాబేరం అంటారు. నిత్యమూ పవళింపు సేవ చేయడానికి వినియోగించే మూర్తిని శయన బేరం అంటారు. కౌతుకబేరాన్ని మధ్యవర్తిగా వినియోగిస్తారు. అంటే తిరుమంజనం (స్నానం) సమర్పించే ముందు ధృవ బేరంలోని కళాశక్తిని కౌతుక బేరం ద్వారా స్నపన బేరంలో ప్రవేశింపజేసి, ఆ ఉపచారం పూర్తి కాగానే ఆ శక్తిని తిరిగి కౌతుక బేరం ద్వారానే ధృవమూర్తిలోకి మారుస్తారు. ఇలాగే ఇతర ఉపచారాల్లో కూడ చేస్తారు. అయితే సాధారణంగా ఎంత చిన్న ఆలయంలో అయినా ధృవమూర్తి, ఉత్సవమూర్తులు తప్పక ఉంటారు.

దేవాలయంలోని పూజారులు పై వస్త్రాలను ధరించరు. ఎందుకని? కేవలం పంచె మాత్రమే ధరించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి?

 దేవుడి సన్నిధిలో ఆడంబరమైన వస్త్రధారణ చేయరాదని శాస్త్ర నియమం. సామాన్యంగా అర్చకులు పైన ధరించే ఉత్తరీయం అంచులు మొదలైన అలంకారాలతో కొంచెం ఆడంబరంగా ఉంటుంది. అది త్రిజగత్ ప్రభువైన దేవుడి దగ్గర వినయ ప్రవర్తనకు అనుకూలం కాదు. అందువల్ల పై ఉత్తరీయాన్ని నడుముకి చుట్టుకుని పూజాదులు చేయటం ఒక వినయ సంప్రదాయంగా ఏర్పడింది. ఇది దక్షిణ భారతంలో మరీ ఎక్కువ. చలి ఎక్కువగా ఉండే ఉత్తరదేశంలో ఈ ఆచారం లేదు. మన దేశంలో గూడా చలికాలంలో దేవ సన్నిధిలో ఉత్తరీయం ధరించవలసి వస్తే, దుప్పటి కప్పుకున్నట్లు కాక యజ్ఞోపవీతం వేసుకున్నట్లుగా, వల్లెవాటుగా, ఉత్తరీయాన్ని ధరించాలని ధర్మశాస్త్రాలలో ఉంది.

దానం మహత్త్వం: శుభఫలితాలకు మార్గం - ఆచరిద్దాము

 నదీ తీరంలో, కొండలపై, పుష్కరాల సమయంలో, దేవాలయాల దగ్గర బ్రహ్మోత్సవాల సమయాల్లో శాస్త్రోక్తంగా వస్త్ర, వస్తు, ధాన్య, ధన రూపేణా ఏదైనా దానం చేయడం చాలా పుణ్యప్రదం. సకల దోషాలు పరిహరింపబడతాయి, గృహంలో ధన, ధాన్య, ఆరోగ్య అభివృద్ధి లభిస్తుంది, సుఖ శాంతులు లభిస్తాయి, వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి, శుభకార్యాలు జరుగుతాయి.

హృదయాన్ని విశాలంగా చేసుకునే శక్తి: త్యాగం ప్రేరణ - ఆచార్య ఆధ్యాత్మిక చింతన,

మనమంతా దివ్యమైన ఆత్మస్వరూపులమనే సహజ జ్ఞానం మనలోనే ఉన్నది. స్వార్థాన్ని విడిచి, ఫలితాలను గురించి భయాన్ని వదలి కార్యరంగంలోకి దుమికినప్పుడే ఘనతర కార్యసాధన జరుగుతుంది. పరిత్యాగం సంకుచితపు పరిధి నుండి విడుదలను ఇస్తుంది. మన సహజ స్వభావానికి వ్యతిరేకమైన వాటి నుండి తప్పిస్తుంది. పెను ప్రవాహం వచ్చినప్పుడు పిల్లకాలువలు తమ ఉనికిని కోల్పోతాయి కదా! అలాగే అల్ప విషయాలను తుడిచి వేయడం ద్వారా హృదయ వైశాల్యం విస్తరించి వీరోచిత కార్యాలకు ప్రేరణ కలుగుతుంది.

ప్రయాణమై బయలు దేరునప్పుడు ఎవరైనా తుమ్మితే ఏమి చేయాలి - ఆచరిద్దాము

ప్రయాణమై బయలు దేరునప్పుడు ఎవరైనా తుమ్మితే కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని కూర్చుని దైవ ధ్యానం చేసుకుని, నోరు తీపి చేసుకుని వెళితే ఏ దోషం అంటదు. పనులు సానుకూలం అవుతాయి. శుభంభూయాత్.

ప్రదేశం మారితే లాభం లేదు. ఏ విషయంలోనైనా మారాల్సింది మనిషి బుద్ధే. - మంచిమాటలు

 ప్రదేశం మారితే లాభం లేదు. ఏ విషయంలోనైనా మారాల్సింది మనిషి బుద్ధే. దైవ ప్రార్థన ఏకాంతంగా చేయాలి. ప్రార్థన అనేది మెదడులోంచి కాక హృదయంలోంచి వస్తేనే అది టూ వే సంభాషణ అవుతుంది. అది దేవుడికీ, మనకు సంబంధించినది తప్ప, మనకు ప్రపంచంలోని ఇతరులకి సంబంధించినది కాదు. శిక్ష పడుతుందన్న భయంతో కానీ, బహుమతి లభిస్తుందన్న ఆశతో కానీ దేవుడ్ని కొలవడం తప్పు. దేవుడ్ని చేరుకోవడానికి మాత్రమే కొలవాలి. ఆధ్యాత్మిక వివేచనతో మేలైన వివేకం అలవరచుకుంటే ఆటవికులు కూడా జ్ఞానులైన యోగులవుతారు. స్పష్టమైన జ్ఞాన నియంత్రణలో ఇంద్రియాలు సులువుగా, ఆనందంగా మన అధీనంలోకి వస్తాయి. అప్పుడు మనకు ప్రతిగా కాక మనకు అనుకూలంగా ప్రవర్తిస్తాయి. విలువలే మన ప్రవర్తనకు పునాదిరాళ్ళు. మన సంస్కృతికి సమగ్ర భాగస్థులు. మన విలువలు దృఢంగా ఉంటే మనకు తప్పు, ఒప్పులు సులువుగా తెలుస్తాయి. తదనుగుణంగా మనం క్రియాత్మకులం కావచ్చు.

ఇచ్చేవాడికంటే పుచ్చుకునే వాడే గొప్ప - మంచిమాటలు

ప్రాపంచిక వ్యామోహాలు, సుఖాలు అనే మురికి బట్టలని వదిలి, శాశ్వత సుఖం లేదా మోక్షం కోసం సదా ప్రయత్నం చేయాలి. ఇచ్చేవాడికంటే పుచ్చుకునే వాడే గొప్ప. మన నుంచి దానం పుచ్చుకొనే వారి వల్లే మనకు పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం, తద్వారా ఉత్తమ గతి పొందే అవకాశం మనకు కలుగుతాయి. మనకు ఆ అవకాశాన్ని కల్గించినందుకు దానం పుచ్చుకున్న వారికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి. మనకు కేటాయించబడిన ఎంత చిన్న పనైనా సరే శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధ చేస్తే అందువల్ల మనకే గాక ఇతరులకి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. మనం చేసే దుష్కర్మలు కొన్ని వెంటనే, త్వరగా ఫలితాలను ఇస్తే, మరికొన్ని కొంత సమయం తీసుకున్నాక ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం చేసే అన్ని పనుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతి మంచితనం, అతిగా దానం చేయడం, అతి పరాక్రమం, తాను గొప్పవాడను అని భావించే వారి దగ్గరకు లక్ష్మీదేవి చేరదు.

"దైవ దృష్టితో ఆధ్యాత్మిక ప్రగతిని పొందడం ఎలా? - మంచి మాట

 మనం మన దృష్టిని సదా ఆ దైవం మీద ఉంచితే మనం సూటిగా ఆయన్ని చేరుకుంటాము. అలా కాక దృష్టిని పక్కవాటి వైపు మళ్ళిస్తే దారి తప్పుతాము. కాబట్టి మన గమ్యం సదా ఆ పరమత్మే అయి ఉండాలి. మనది పోకూడదు అనుకోవడం లోభం. ఇతరులకు చెందింది మనకు రావాలని కోరుకోవడమే స్వార్థం. ఈ రెండూ మనిషికి ఆధ్యాత్మికంగా చెరుపు చేస్తాయి. మనలో ఎక్కువమంది బహుమతుల వెంటపడి, దేవుడి వైపు వీపుని పెడుతుంటారు. దేవుడి బహుమతులను కాక, దేవుడిని పొందాలన్నది మన ధ్యేయం అయి ఉండాలి. బాధపడే వాడిని చూసి సహాయం చేయడానికి పరుగెత్తే కాళ్ళు, అతనికి స్వాంతనని ఇవ్వడానికి చాచే చేతులు, అతని బాధని చూసి దయతో కన్నీళ్ళు కార్చే కళ్ళు, అతని బాధని తగ్గించే విధంగా మాట్లాడే నాలుక గలవాడే నిజంగా దేవుడు ప్రేమించే మనిషి. ఎందుకంటే దేవుడ్ని ప్రేమించే వాడే ఆ విధంగా ప్రవర్తించగలడు. అలాంటి వాడంటేనే దేవుడికి ఇష్టం.

గరుడపురాణంలో చేసిన కర్మలకు రకరకాల శిక్షలు ఉన్నవి అన్నారు. ఆ శిక్షలు పొందేదెవరు?

దేహం వదిలిన తర్వాత మిగిలేది ఆత్మయే గదా - అంటున్నారు. ఎవరు చెప్పారీ మాట? స్థూలదేహం పోయినా జీవాత్మకు సూక్ష్మదేహం ఉండనే ఉంటుంది. అది యమలోకంలో "యాతనా దేహము" అనబడే స్థూలదేహాన్ని స్వీకరిస్తుంది. ఆ శరీరంతో ఆ లోకంలోని శిక్షలను జీవుడు అనుభవిస్తాడు. ఈ విషయాలు గరుడపురాణంలో కూడా ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి.

పవిత్రత అనే లేపనం ద్వారా లభించే ఉపశమనం - ఆచార్య ఆధ్యాత్మిక చింతన

పవిత్రత అనే లేపనం ద్వారా లభించే ఉపశమనం ఈ ప్రపంచానికి అవసరమై ఉంది. ఒక మనిషి ఏ విశ్వాసాన్నీ అవలంబించకపోవచ్చు, కానీ అతను అన్ని విశ్వాసాల స్వరూపమై ఉండవచ్చు. ఆధ్యాత్మిక జీవనం ద్వారా పవిత్రత చేకూరుతుంది. ఆచరణాత్మక ఆధ్యాత్మిక జీవనాన్ని మనం అవలంభిస్తేనే ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాము. మనలో అంతరంగ అన్వేషణ ప్రారంభమైనప్పుడే ఇతరుల అంతరంగంలోకి ప్రవేశించగలం. ఏది సంభవించినా సణుగుకోకుండా మన ఆదర్శం కోసం జీవితాన్ని అంకితం చేయాలి. "శుభం భూయాత్"

పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే," "స జాతో యేన జాతేన యాతి వంశః సమున్నతిం. - శ్లోకం - భావము

 "పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే," "స జాతో యేన జాతేన యాతి వంశః సమున్నతిం."   చావు పుట్టుకలు అనే చక్రంలో చిక్కుకోనిదెవరు? పుట్టినవాడు మరణిస్తాడు. మరణించినవాడు తిరిగి జన్మిస్తాడు. కానీ ఎవరి పుట్టుకతో అతని వంశానికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయో అతడే ధన్యుడు. అతని జీవితమే సార్థకం.

వంశానికొక్కడు - మంచి మాటలు

ఈ లోకంలో ఎందరో పుడుతుంటారు, ఎందరో గిడుతుంటారు. కానీ మహనీయులుగా నిలిచేది మాత్రం కొందరే. మన కోసం మనం బతికేది అర్థం లేని జీవితం. మనతోపాటు మరికొందరిని బతికించడం మహనీయత్వం. అలా తన వల్ల తన వంశానికి మంచి పేరు తెచ్చిపెట్టిన వాఏ మహాత్ములు. వారి జీవితమే సార్థకం అని భర్తృహరి తన నీతి శతకంలో ఇలా చెప్తున్నాడు

మంచి పని మనసుకు సంతోషానిస్తే, చెడ్డ పని మనసును నొప్పిస్తుంది - మంచి మాటలు

మంచి పని మనసుకు సంతోషానిస్తే, చెడ్డ పని మనసును నొప్పిస్తుంది. పొగిడే వాళ్ళకంటే ఎక్కువ దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేరు. ఆరోగ్యానికీ, ఆనందానికీ నీతి సూత్రాలే బలమైన పునాదులు. మంచి స్నేహం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నిటినీ ప్రసాదిస్తుంది. మన మాటలకు, చేతలకు తేడా ఉంటే, మనల్ని ఎవరూ ఎప్పటికీ నమ్మరు.

పౌరాణిక నీతి కథలు - మహాదాత కర్ణుడు

Hindu Mythological Stories By Sri Hanuman Astrology     పౌరాణిక నీతి కథలు - మహాదాత కర్ణుడు | Hindu Mythological Stories By Sri Hanuman Astrology నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు శ్రీహనుమాన్ జ్యోతీషాలయం జ్యోతీషం మరియు ఆధ్యాత్మిక నిలయం. Sri Prasannanjaneya Swami Temple Venkataramaiah Colony Medchal Rangareddy - 501401  

పౌరాణిక నీతి కథలు - భీముడు, హనుమంతుడు కథ

Hindu Mythological Stories - Bheem And Hanuman Story   పౌరాణిక నీతి కథలు: భీముడు - హనుమంతుడు. మహాభారతంలో హనుమంతుడి పాత్ర Hindu Mythological Stories By Sri Hanuman Astrology నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు శ్రీహనుమాన్ జ్యోతీషాలయం జ్యోతీషం మరియు ఆధ్యాత్మిక నిలయం. Sri Prasannanjaneya Swami Temple Venkataramaiah Colony Medchal Rangareddy - 501401      

సహనం, పట్టుదల, నిలకడ. - మంచి మాటలు

 జీవితంలో ఉన్నత విలువలు సాధించాలంటే సహనం, పట్టుదల, నిలకడ కావాలి. మనకు ఎవరి వల్లనైనా హాని కలిగితే అది మన మంచికే అని భావించి, బాధను భరించాలి. మనలోని స్థిరత్వాన్ని చూపేందుకు, మనపై మనకు గల విశ్వాసాన్ని ప్రకటించేందుకు ఒక చక్కటి అవకాశాన్ని వారు కలిగించారని వారి ఎడల కృతజ్ఞతను ప్రకటించాలి. ఎటువంటి ఒత్తిడి ఎదురైనా సమతుల్యతను కోల్పోకుండా ఉండగలగడమే మనిషిలోని శక్తికీ, జ్ఞానానికి కొలబద్ద. జీవితంలోని ఆటుపోట్లను సహించేందుకు మనిషికి సమత్వస్థితి, వివేకవంతమైన జ్ఞానం ఆవశ్యకం.

వివాహ సమయంలో సప్తపది అంటారు. దీని పూర్వాపరాలు తెలియజేయండి

 "సఖ్యం సాప్తపదీనం" అనేది ఒక శాస్త్ర సూత్రం. అంటే ఏడడుగులు కలిసి ప్రయాణం చేస్తే వారిద్దరికీ స్నేహం కుదురుతుంది - అని భావం. ఈ సూత్రాన్ని తీసుకుని ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క సంకల్పాన్ని జోడించి, వధూవరులిద్దరి చేత సంయుక్తంగా ఏడడుగులు వేయించే వేదోక్త ప్రక్రియే సప్తపది.

అఖండ శక్తి - మంచి మాట

అఖండశక్తితో మహోన్నతంగా స్థిరంగా నిలబడాలి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనపుడు కూడా మనిషి ధైర్యంగా నెట్టుకు రాగలిగితేనే విజేతగా నిలుస్తాడు. ఆపద కలిగినప్పుడు దాని నుండి పారిపోయి మరియొక సమస్య తెచ్చుకోవడం సరైనది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి. మనం పరమాత్మునితో ఎంతగా సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తి శాలురం అవుతాము, ఇంక అప్పుడు ఏ బలహీనతలూ మనల్ని బాధించలేవు.

నవగ్రహాలను శుభ గ్రహాలు, పాప గ్రహాలు అని ఎందుకు విభజించారు?

 నవ గ్రహ దేవతలందరూ పవిత్రులే. వీరు స్వయంగా ఎవరికీ ఏ శుభ ఫలితాలనూ ఇవ్వరు. ఆయా జీవులు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మలో రాబోతున్న ఫలితాలను సూచిస్తారు - అంత మాత్రమే. పాప ఫలితాలను సూచించే గ్రహాలను పాపగ్రహాలనీ, పుణ్యఫలితాలను సూచించే గ్రహాలను శుభగ్రహాలనీ, ప్రాయశ్చిత్త కర్మలను నిర్ణయించే సౌకర్యం కోసం మాత్రమే విభజించారు. గ్రహ జపాదులన్నీ ప్రాయశ్చిత్త కర్మలే.

దేవకీ నందనుడైన దేవదేవునికి జయము జయము

 దేవకీ నందనుడైన దేవదేవునికి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీకృష్ణమూర్తికి జయము జయము! మేఘశ్యామలమూర్తి, కోమలాంగుడైన శ్రీకృష్ణునికి జయము జయము!   పృథ్వీ భారం తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!

భారతీయ తత్త్వ విచారధారలో ఉపనిషత్తులు

 ఉపనిషత్తులు వేద భాగాలుగా సనాతనాలు. ఇందులో సత్యం భగవన్ముఖోదీరితం. ఈ సత్యం ప్రత్యక్షానుమానాది భౌతిక పరిచ్ఛిన్న ప్రమాణాల ద్వారా తెలుసుకొన్నది కాదు. మరి, ఋషులు సాక్షాత్తుగా దర్శించినది. మన ప్రత్యక్షానుభవంకంటే ఋషుల దర్శనానుభవం నిర్దుష్టం, ప్రామాణికం, వాస్తవం, దివ్యమూను. యాస్కుల వారు "సాక్షాత్కృత ధర్మాణః" అంటారు ఋషులని. వారి ప్రయత్నం లేకుండానే వారి ఎదలలో భాసించే దివ్య సత్యం ఇది. "పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం" అంటారు శ్రీశంకరులు ఈ సత్యాన్ని.

మంచి మాటలు

 ఆచార్యుని శ్రీచరణాలయందు ప్రేమ గల వారికి పరమ పదం అర చేత ఉసిరికాయ వంటిది. మన అదృష్టంకొద్దీ మనకు సదాచార్యులు లభిస్తారు. వయస్సు వారికి అంటదు.  <><><><><><><><><><><><><><> ఆచార్యులను లభింప చేసిన భగవంతుని పట్ల నీవు సదా కృతజ్ఞుడవై ఉండాలి. ఆచార్యుడు శిష్యుని ఆత్మను రక్షిస్తాడు, శిష్యుడు ఆచార్యుని భౌతిక శరీరాన్ని కాపాడుకోవాలి.  <><><><><><><><><><><><><><>  ఆచార్యులు దివ్య దేహధారులు. నీ శరీరంలాంటి పాంచభౌతిక శరీరం కాదు వారిది. అందుకే రజః తమో గుణమయమైన మనస్సు కూడ వారికి ఉండదు. అది శుద్ధ సత్వము. <><><><><><><><><><><><><><> "శ్రీమన్నారాయణా!" నీవు ఆశ్రితుల పాపాలను హరించే దయాళుడవు. అందువల్ల నేను నీకు వందనాలు చేసి యాచించేది ఏమిటంటే, నాకు ఏ  జన్మ లభించినా నీ పై తలంపు గలిగేటట్లుగా అనుగ్రహించు. అలాంటి నీ భావన చేత ఎలాగైనా ఈ సంసార ...