Skip to main content

Posts

Showing posts from June, 2021

ముప్పది మూడు కోట్ల మంది దేవతలంటారు కదా, వారి వివరాలు ఏమిటి?

సమాధానం:   "లెక్కలేనంతమంది" అని చెప్పడానికే, ముప్ఫై మూడు కోట్ల దేవతలని, ముక్కోటి దేవతలని అంటారు. అట్లాగే "సహస్ర శీర్ష పురుష" అంటే అసంఖ్యాకమైన తలలు ధరించే శక్తి కలిగిన పురుషోత్తముడనే అర్థం చేసుకోవాలి. కేవలం వెయ్యి తలలు కలిగిన వాడనే అర్థంకాదు. అసలు ముప్పది ముగ్గురు  దేవతలనే వేదం చెప్పింది. అయితే వీరు ముప్ఫై మూడు వర్గాలకు చెందిన అనేకమంది దేవతలు. ఎనిమిది మంది వసువులు, పదకొండుమంది రుద్రులు, పన్నెండు మంది ఆధిత్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం ముప్పది ముగ్గురు. దేవతలకు వైద్యులే అశ్వనీ దేవతలు. అందరు దేవతలకంటే అన్ని విధాల అధికుడైన దివ్యతేజోమూర్తినే దేవుడు అని పిలవాలి.

స్తోత్రానికి, మంత్రానికి తేడా ఏమిటో చెప్పండి?

సమాధానం: భగవత్ స్తోత్రం ఏదైనా భాషా దోషాలు లేకుండా మీకు వచ్చిన, నచ్చిన శైలిలో రాగయుక్తంగానో, ఉత్తవచనంలోనే ఏదో ఒక పద్ధతిలో మనస్సు లగ్నంచేసి చదువుకోవచ్చు. అయితే పురుషసూక్తం వంటి వేదానికి చెందిన స్తోత్రాలను ఇప్పటికే వేద పండితులచే పఠింపబడుతున్న స్వరాలలోనే చదవాలి. వేదమంత్రాలు స్వరం మార్చి చదివితే అపార్థాలు, అనర్థాలు వచ్చే ప్రమాదం ఉన్నది. గాయత్రీ మంత్రం కూడా అలాంటిదే. ఒక్కోదాన్ని బట్టి స్వరం మారుతూ ఉంటుంది. స్తోత్రం ఎంత పెద్దదైనా ఉండవచ్చు, కాని మంత్రం సంపుటి అక్షరాలతో ఓంకారంతో చిన్నదిగానే ఉంటుంది.  ఉదా;- పంచాక్షరి, షడక్షరి, అష్టాక్షరి మొదలైనవి. మంతారంత్రాయతే ఇతి మంత్రః మననం (జపం) చేస్తే రక్షించేదే మంత్రం. మనస్సుకు శాంతిని, దాంతిని, అనన్య భక్తిని, సత్ప్రవర్తనను కలిగించేదే స్తోత్రం. స్తోత్రం గురూపదేశం లేకుండా చదువుకోవచ్చు. కాని మంత్రం గురూపదేశంపొంది, నియమనిష్ఠలతో జపిస్తేనే ఫలితానిస్తుంది.

మొదట వేదాలు పుస్తకరూపంలో లేవు కదా, వాటిని రాక్షసులెట్లా అపహరించారు? అవి బ్రహ్మకు మరలా ఎలా చేరాయి?

సమాధానం:   హయగ్రీవ అవతార కథంతా చెప్పుకుంటేగాని ఈ ధర్మసందేహం తీరదు. సృష్టి ఆరంభంలో పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని ఉపదేశించాడు. అప్పుడు బ్రహ్మ ఎదుట నాలుగు వేదాలు నలుగురు వేదపురుషులై సాక్షాత్కరించారు. అదే సమయంలో మధుకైటభులనే అసురులు వచ్చారు. వారు బ్రహ్మతో, వేదపురుషులతో తలపడి, నలుగురు వేదపురుషులను బందీలను చేసి రసాతలానికి తీసుకువెళ్ళిపోయారు. బ్రహ్మ వేడుకొనగా, పరమాత్మ రసాతలలోకానికి వెళ్ళి, హయగ్రీవ స్వరూపం ధరించి గట్టిగా సకలించాడట. ఆ ధ్వనికి భయపడి, అసురులు పారిపోగా హయగ్రీవుడు అక్కడున్న నలుగురు వేదపురుషులను జాగ్రత్తగా పైకి తెచ్చి బ్రహ్మకు మళ్ళీ అందించారు. హయగ్రీవుని సకిలింపు ఉద్గీధం అనే సామవేదగానంలా ఉంటుంది. ఆ తర్వాత ఆ రాక్షసులు విష్ణువుపైకి యుద్ధానికి వెళ్ళి, ప్రాణాలు పోగొట్టుకొన్నారు. హయగ్రీవుడు రూపుదాల్చిన విద్యగా ఆరాధనలందుకుంటున్నాడు. హయ అంటే అశ్వము, విజ్ఞానము. గ్రీవము అంటే కంఠము. అన్ని రకాల విద్యలు కంఠగతాలై ఉన్న సర్వ విద్యా స్వరూపమే.   గుర్రమువంటి శిరస్సు మానవదేహము కల హయగ్రీవమూర్తిని ఆయన అవతరించిన శ్రావణ పూర్ణిమ రోజున ఆయన్ను ఆరాధిస్తే, నిత్యము ధ్యానిస్తే సర్వవిద్యలను ప్రసాదిస్తాడని భాగ

ఆకారత్రయం అంటే ఏమిటి? ఇది ఎవరికి వర్తిస్తుంది?

సమాధానం:   లక్ష్మీదేవి ఆకారత్రయ సంపన్న. అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం ఈ ముడు లక్ష్మీదేవి లక్షణాలు. అనన్య శేషత్వం అంటే అన్యులకు గాక భగవంతునికి మాత్రమే చెంది, ఆయన ఇష్టానికి తగినట్లుండడం. అనన్య శరణత్వం అంటే భగవంతుడు తప్ప మరో శరణ (రక్షకం) ఆమెకు లేదు. ఆమెకు దిక్కు, దీపమూ అంతా ఆయనే. అనన్య భోగ్యత్వం అంటే ఆమె భగవంతునిచే మాత్రమే భోగ్య అంటే అనుభవింపదగినది. అయితే ఈ మూడు లక్షణాలు ఆమెకే ఉన్నాయా? మరెవరికీ లేవా? ఎందుకు లేవు? జీవులందరికీ ఈ మూడు లక్షణాలు ఉండాలి. లక్ష్మీదేవి కూడ మన జీవకోటిలోనిదే. అయినా మనకన్నా ఎంతో మిన్న ఎందువల్ల? ఆమెకు మనలో ఉండని మరో రెండు విశిష్ట లక్షణాలున్నాయి. అవే ఘటకత్వం, ప్రాప్యత్వం. ఘటకత్వం అంటే జీవుల్ని భగవంతుడితో చేర్చే ఘటికురాలామె. ప్రాప్యత్వం అంటే పరమాత్మతో సమానంగా ప్రాప్యమైనది. అంటే పొందతగినది. ఆ దివ్య మిథునానికి (జంటకు) కైంకర్యం సమర్పించడమే మనకు మహాభాగ్యం. ఈ విధంగా జీవత్వ, ఘటకత్వం ప్రాప్యత్వములనే మూడు ఆకారాలు కలిగిన ఆమె అకార త్రయ సంపన్న. ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీ శిత్రీం వందే వరద వల్లభామే ఈ ధ్యాన శ్లోకంలో, శ్రీరంగం, తిరుమల, మేలుకోట, కాంచీప

దైవప్రార్థనలో ఫలానా కోరికలు తీర్చమని ప్రార్థించవచ్చా?

సమాధానం:   కోరికలు కోరుతూ అయినా దైవానికి ప్రార్థన చేయవచ్చు, తప్పులేదు. అయితే మనం కోరినవన్నీ భగవంతుడు ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మన యోగ్యతను చూచి ఆయన ఇవ్వతగినవి ఇస్తాడు. మనం ఏమీ కోరుకోకుండా, ప్రార్థన చేస్తే తన ఔన్నత్యానికి దీటుగా ఔదార్యంతో మనకు ఏం కావాలో పరిశీలించి ఇస్తాడు. ఇదే గోదాదేవి మనకు చెప్పిన పాఠం. కోరిన దేవతలకు రాక్షసుల నుండి రక్షణ కల్పించాడు. ఏ కోరికలు కోరని ధృవుడికి శాశ్వత స్థానాన్ని ఇచ్చాడు. అయితే కోరికలు కోరడం, ఆపద మొక్కులు మ్రొక్కడం మానవ నైజం. అలాగే తన భక్తులను ఆదుకోవడం భగవంతుని కృపా విశేషం.

రామాయణంలో సుందరకాండకు ఆ పేరెలా వచ్చిందో దయచేసి తెల్పగలరు.

సమాధానం:   రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ మొదలైనవి పేర్లు చదివితేనే వాటిల్లో విషయమేమిటో తెలిసిపోతుంది. కానీ సుందరకాండకు ఆ పేరెలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ శ్లోకాలు చదవాలి. సుందరే సుందరోరామః సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం సుందరే సందరః కపిః సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? శ్రీరాముని సౌందర్యం, మూర్తిమత్వం, సుందరకాండలోనే అధికంగా వర్ణింపబడ్డాయి. అందుకే అది సుందరకాండ. సీతా సౌందర్యం, సౌశీల్యం ఎంత గొప్పవో దీనిలో నిరూపింపబడ్డాయి. అందుకే ఇది సుందరకాండ. ఈ కాండంలో ప్రధానపాత్ర హనుమ. ఆయనకు సుందరుడు అనే పేరుంది. సౌందర్యం ఆకారంలో ఉండదు. ప్రాకారం(నడత)లో ఉంటుంది. సీతారాములకు ఆనందం కలిగించిన అందగాడు ఆంజనేయుడు. సుందరకాండలో కథ బహుసుందరమైంది. కావ్య లక్షణాలలో ముఖ్యమైన శబ్ధం, అర్థం, రసం ఈ కాండలో సుందరంగా అమరి ఉన్నాయి. సుందరకాండ నవరసభరితం. ఆధ్యాత్మికంగా భగవత్ (శ్రీరాముని) సౌందర్యాన్ని, జీవ (సీత) సౌందర్యాన్ని, ఆచార్య (హనుమ) సౌందర్యాన్ని వర్ణించిన కాండ సుందరకాండ. అది సర్వాంగ సుందరం. సుందరకాండ మహిమాన్వితమైన మంత్రరాజం. అందమైన అశోకవనం సుందరకాండను శోభింపజేస్తుంద

భక్తి మార్గాలెన్ని? ఆంజనేయస్వామిది ఏ మార్గం?

సమాధానం:   "భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు. వీటిలో మొదటిది శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. భగవంతుని గుణములను, నామాలను, కథలను ఎప్పుడూ వింటూ ఉండాలి. రెండోది కీర్తనం. ఆయన లీలలను నామాలను గానం, ప్రవచనం చేస్తూ ఉండాలి. మూడోది స్మరణం. ఇందులో భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. నాలుగోది పాదసేవనం. నిరంతరం ఆయన పాదాలను దర్శిస్తూ ఉండాలి. అయిదోది అర్చనం అంటే పూజించడం. ఆరోది వందనమంటే నమస్కారం. ఏడోది దాస్యం. స్వామికి దాసునిగా, భృత్యునిగా ఉండాలి. ఎనిమిదోది సఖ్యం చేయడం స్నేహం చేయడం. తొమ్మిదోది ఆత్మనివేదనం. తాను తనది అంతా ఉన్నది ఆయన కోసమే అని తెలుసుకుని భగవంతునికు సమర్పించాలి. ఏ విద్యకైనా పరమప్రయోజనం ఇదే అంటాడు ప్రహ్లాదుడు. కలియుగంలో అర్చామూర్తికే ఒకటి తర్వాత ఒకటిగా తర్వాత ఒకటిగా ఈ నవవిధ సేవలు అర్పించి, తరించాలి. ఆంజనేయస్వామివారిది "దాసోహం కోసలేంద్రస్య" అంటూ అధికంగా దాస్యభక్తినే ప్రదర్శిస్తాడు. శుభం భూయాత్

ఆంజనేయస్వామి సముద్రలంఘనం ఘట్టం నుంచి మానవజాతి నేర్చుకోవాల్సినది ఏమైనా ఉందా?

సమాధానం : మన ఇతిహాస పురాణాల్లోంచి మనం నేర్చుకొని పాటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆంజనేయస్వామి సముద్రలంఘనం చేసి, నూరు యోజనాలు దాటి లంక చేరాడు. అలాగే మనం సంసార సాగరాన్ని నూరేళ్ళ ఆయుర్ధాయం లోపల దాటి ఆవలి తీరం చేరాలి. యోగి, సాధకుడు, ఆచార్యుడు అయిన హనుమ తనను తాను రామబాణంతో పోల్చుకున్నాడు. ఇదే కర్మయోగం యొక్క మూలసూత్రం. హనుమ ఈ పనిని తాను చేస్తున్నానని కానీ, ఇది తన కోసమే అని కానీ, ఇది తనది అని కానీ తలవడంలేదు. రామకార్యం కోసం రామబాణంలాగా వెళ్తానంటాడు. ఈ జీవన సూత్రాన్ని మనం పాటించాలి. అంతా నేను, నాది అనే భావం మనలో తగ్గాలి. సముద్రాన్ని దాటడంలో హనుమ నాలుగు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఏ ఆలంబనము లేకుండా అగాథమైన సాగరాన్ని దాటడం, మైనాకుడి అతిధ్యాన్ని సున్నితంగా తిరస్కరించి ఆగకుండా ముందుకు సాగడం, సురస అనే రాక్షసిని ఉపాయంతో జయించడం, సింహిక అనే ఛాయా రాక్షసిని సంహరించడం ఈ పనుల్ని అవలీలగా చేసిన హనుమను దేవతలు ఇలా మెచ్చుకున్నారు. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర! యథాతవ ధృతిర్దృష్టిర్కమతిర్ధాక్ష్యం స్వకర్మ సు నసీదతి ఓ వానరేంద్రా! నీలా ఎవరికైతే ధైర్యం, పూనిక, గమ్యంపై దృష్టి, వివేకం, యుక్తి, సామర్థ్యం ఉంటాయో అతడు తన ప

ఆంజనేయస్వామిని తమలపాకులతో, వెన్నతో పూజిస్తారెందుకు?

సమాధానం: పచ్చని ఆకులు, వెన్న రెండూ దేహంలో ఏర్పడే తీవ్ర ఉష్ణాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. తపస్సు, ఆలోచనలు అధికంగా చేసే వారిలో తీవ్రమైన వేడిపుడుతుంది. ఆంజనేయుడు ఎల్లప్పుడూ శ్రీరామనామాన్ని జపిస్తూ, వేరే తలపు లేకుండా తదేక ధ్యానంలో నిమగ్నం అయి ఉంటాడు గదా! అలాంటి వారిలో కలిగే వేడి వల్ల లోకాలన్నీ తపింపబడతాయట. దేవతలు కూడా ఆ ఉష్ణ తీవ్రతను భరించలేరట. చిరంజీవి అయిన హనుమకు శ్రీరామధ్యానం వల్ల పుట్టే వేడిని తగ్గించడానికి, శీతలోపచారంగా ముఖ్యంగా మంగళవారాలు తమలపాకులతో పూజ, వెన్న పూత సమర్పించడం ఆనవాయితీ అయింది. జైశ్రీహనుమాన్

హనుమాన్ గురించి సమగ్ర విశేషాల తెలుసుకోవాలని ఉంది. ఏం చెయ్యమంటారు?

సమాధానం: శ్రీ ఆంజనేయస్వామి అందరికీ ఆదర్శమూర్తి, ఆరాధ్యుడు. పరమపదముకంటే శ్రీరామపాదమునే నిరంతరం సేవించాలని, ఆయన నేటికీ హిమాలయాల్లో తపస్సులో మునిగి ఉన్నాడట. ఆయన హృదయంలో రాముడే నిత్యనూతనంగా కొలువు ఉంటాడు. హనుమ గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే హనుమాన్ చాలీసా బాగా అధ్యయనం చెయ్యండి. శ్రీవాల్మీకి రామాయణం విశేషార్థాలతో చదవండి. దేవతలు హనుమను ఇలా ప్రశంసించారు. "ఓ వానరేంద్రా! నీలా ఎవరికైతే ధైర్యం, పూనిక, గమ్యంపై దృష్టి, వివేకం యుక్తి సామర్థ్యం ఉంటాయో వారు తమ కార్యంలో విజయం సాధిస్తారు". ఆంజనేయుడు వేదాలు చక్కగా నేర్చినవాడని, సంభాషణలో నిపుణుడని శ్రీరామునిమాట. అందుకే హనుమను జీవాత్మ (సీతను), పరమాత్మను (శ్రీరాముడు) కలిపే ఆచార్యునిగా పెద్దలు పేర్కొంటారు. ఈ లోకంలో రామభక్త హనుమాన్ గానే ఉండాలని ఆయన కోరుకుంటాడు. శుభంభూయాత్

గ్రహణాల గురించి మన జ్యోతిష పండితులు చెప్పేదొకటయితే, ఆధునిక శాస్త్రవేత్తలు మరొక విధంగా చెప్తున్నారు. ఎవరు చెప్పేది నమ్మాలి?

సమాధానం: ఇద్దరు చెప్పేవీ నమ్మదగినవే. సూర్య చంద్ర గ్రహణాల గురించి వారిద్దరూ చెప్పే విషయంలో వైరుధ్యం ఏమీలేదు. వేదంలో ఉన్న విజ్ఞానాన్ని బీజరూపంలో ఉన్న కథలనే పురాణాల్లో విశదంగా కథల రూపంలో వివరిస్తారు. రాహువనే రాక్షసుడు సూర్యుణ్ణి ఆక్రమించి అంధకారంతో కప్పివేస్తే, అత్రి మహర్షి తన మంత్ర, యంత్ర, తంత్ర శక్తులతో సూర్యుణ్ణి మరలా ప్రకాశించేలా చేశాడని ఋగ్వేదంలో ఉంది. ఇదే భాగవత పురాణంలో విశదీకరింపబడినది. క్షీరసాగర మధనంలో వచ్చిన అమృతాన్ని మోహిని రూపంలో విష్ణువు దేవతలకు పంచుతుంటాడు. రాహువు కామ రూపుడై దేవతల పంక్తిలో కూర్చుంటాడు.  ఇది గమనించిన సూర్య చంద్రులు విష్ణువుకు ఉప్పందిస్తే, ఆయన తన సుదర్శన చక్రంతో రాహువు తల ఖండిస్తాడు,  తల రాహు గ్రహంగా, మొండెం కేతు గ్రహంగా హరి కరుణతో ఆకాశంలో నిలుస్తారు. వారికి సూర్య చంద్రులపై ఉన్న ఈ కోపం కారణంగా, అమావాస్య, పౌర్ణమిలలో వారిని గ్రహణాలుగా పట్టుకుంటారని పురాణ కథనం. మన జ్యోతిషశాస్త్రంలో గ్రహణాన్ని ఉపరాగం అంటారు. భూమి నీడ చంద్రుని కప్పివేసినపుడు చంద్ర గ్రహణము, చంద్రుడు సూర్యుని కప్పి వేసినప్పుడు సూర్య గ్రహణము అని సిద్ధాంత శిరోమణి గ్రంధం లో శ్రీభాస్కరాచార్యులు చెప్పారు.

ఏకాదశి వ్రతాన్ని ఎలా చెయ్యాలో తెల్పండి.

సమాధానం:   ప్రతి ఏకాదశినాడు ఉపవాసం చేయాలి. ఆ రోజున యధావిధిగా శ్రీమహావిష్ణువును పూజించాలి. శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి. ఏదైనా హోమం కానీ, భోజనం కానీ, పితృ దేవతలకు శ్రాద్ధం కానీ చేయకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశి రోజున శ్రీమహావిష్ణువు ఆరాధన తర్వాత భోజనం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఉపవాసం ప్రధానమైనది. శుభంభూయాత్

గాఢ నిద్రలో మనస్సు, బుద్ధి, చిత్తం ఆత్మ ఏ ఏ పనులు చేస్తుంటాయి? వాటిలో దేని మీద ఏది పట్టు కలిగి ఉంటుంది?

సమాధానం:   మనసుకు రూపాంతరాలే బుద్ధి, చిత్తం. ఇంద్రియాల ద్వారా మనసు గ్రహించే విషయాలను భద్రపరచే స్టోర్ రూమ్ చిత్తం. చిత్తం నుంచి ఒక్కో అంశంపై అనేక విషయాలను పరిశీలించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. గాఢ నిద్రనే సుషుప్తి అంటాం.   సుష్ఠు అపీతో భవతి=స్వపితి. అంటే పరమాత్మతో బాగుగా కలిసి ఉండడమే సుషుప్తి. గాఢనిద్రలో ఇంద్రియాలు బాహ్య విషయాలను గ్రహించడం విరమిస్తాయి. మనసు నిర్విషయం అవుతుంది. అప్పుడు ఆత్మ పరమాత్మతో బాగుగా చేరిపోయి ఒకటైనట్లుంటుంది. అదే సుషుప్తి. అయితే మనం నిత్యం అనుభవించే సుషుప్తిలో, అవిద్య మనల్ని వదలకపోవడంవల్ల పరమాత్మానుభవం తెలియకుండా పోతోంది. అన్నిటికంటే మన మీద అవిద్యకే పట్టు ఎక్కువ. అది తొలగించుకోవాలంటే భగవదనుగ్రహం ఉండాలి.

బహుళ వ్యాప్తి చెందిన శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, మంగళాశాసనం ఎవరు రాశారు?

సమాధానం:   కౌసల్య సుప్రజారామ తో ప్రారంభమయ్యే సుప్రభాతాన్ని , కమలాకుచ చూచుక కుంకుమ తో అని ప్రారంభమయ్యే శ్రీవేంకటేశ్వర స్తోత్రాన్ని, ఈశానాం జగతోస్య వేంకటపతే అనే శ్లోకంతో మొదలయ్యే శ్రీవేంకటేశ్వర ప్రపత్తిని , శ్రియః కాంతాయ కల్యాణ నిధయే అని మొదలయ్యే మంగళాశాసనాన్ని కాంచీపురంలో నివసించిన శ్రీమాన్ ప్రతివాది భయంకర అణ్ణన్ స్వామి వారు రచించారు. ఇవిగాక తిరుమలలో చదివే శ్రీనివాస గద్యమ్ అనే గంభీర వచనాన్ని శ్రీమాన్ శ్రీశైల రంగాచార్యులు గారు రచించారు. శుభంభూయాత్

అయోధ్యా పట్టణం ఎవరు నిర్మించారు? అక్కడికి సరయూ నది ఎలా వచ్చింది?

సమాధానం: ఈ భూమి పాలానా బాధ్యతను బ్రహ్మ సూర్యుని కుమారుడైన వైవస్వత మనువుకు అప్పగించాడు. ఆ వైవస్వత మనువే అయోధ్యా పట్టణాన్ని నిర్మించి, దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఆయన భార్య పేరు శ్రద్ధ. గురువు వశిష్టుడు. పూర్వకాలం రాజులకు తమ ప్రాభవం చాడుకోవడానికి, లోక కల్యాణానికి యజ్ఞాలు, యాగాలు చెయ్యడం అలవాటు. అలాగే ఒక యజ్ఞం జరిపించమని వశిష్టుడిని అడిగాడు. అపుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు "రాజా! నీవనుకున్న యజ్ఞం చేయించడం నాకనందమే, కాని ఇక్కడ ఒక నది కాని తీర్థం కాని లేవు కదా! నదిలేని చోట యజ్ఞం చెయ్యలేం కదా" అన్నాడు. "ఏం చెయ్యమంటారు గురుదేవా?" అని రాజు అడిగాడు. అపుడు వశిష్టుడు "నీవు నీ బాణాన్ని సంధించి మానస సరోవరం నుండి  ఒక నదిని రప్పించు" అని అన్నాడు. రాజు వెంటనే సంకల్పం చేసి ఒక బాణాన్ని సంధించి విడిచాడు. ఆ బాణం వేగంగా హిమాలయాల్లోని మానస సరోవరం వెళ్ళి అక్కడ నుండి ఒక మనోహరమైన నదికి మార్గాన్ని చూపుతూ, అయోధ్యా నగరానికి తీసుకువచ్చింది. ఆ నది శరము (బాణం) చేత తీసుకుని రాబడింది గాబట్టి శరయూ అని, మానస సరోవరం నుండి తేబడినది కాబట్టి సరయు అని పిలువబడింది. ఆ సరయూ తీర్థంతో వైవస్వత మనువు

గ్రహణకాలంలో మేము ఏం చెయ్యాలో వివరించండి.

సమాధానం: గ్రహణం ప్రారంభం అయ్యే సమయానికి అరగంట ముందు స్నానం చేసి మీరు ఎప్పుడూ చదివే స్తోత్రం గానీ, దేవుడి శ్లోకాలు గానీ అనుసంధించాలి. ఇంకా మీరు నిత్యం జపించే మంత్రం జపిస్తే మంచిది. గ్రహణం విడుపు సమయానికి జపం ముగించాలి. గ్రహణకాలంలో జపం పదిరెట్ల ఫలితాన్నిస్తుందని శాస్త్రం చెబుతున్నది. ఈ సమయంలో ఇచ్చే దానాలు కూడా రెట్టింపు ఫలితాలనిస్తాయి. వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారు గ్రహణ కాలానికి రెండు గంటల ముందే ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. గ్రహణం వీడిన తర్వాత మరల స్నానం, జపం చేసి ఆహారం తీసుకోవాలి. రాహు కేతువుల పట్టులో సూర్యచంద్రులున్నప్పుడు ఆ గ్రహాల కిరణాలు మనుషుల మీదా పదార్థాల మీద పడకూడదు. అందువల్ల ఇంట్లో నిలవ ఉండే ఆవకాయ పచ్చళ్ళ మీద దర్భలు వేసి ఉంచాలి. గ్రహణ సమయంలో భక్తులు ఇంట్లోనే స్నాన, జప తపాలు చేసుకుంటూ ఆలయాలకు వెళ్ళకూడదు. ఈ అపవిత్ర సమయంలో దేవాలయాలను మూసి ఉంచడం సంప్రదాయంగా వస్తున్నదే.

దర్భలకు ఎందుకు అంత ప్రాధాన్యత? వాటిని ఎవరు సృష్టించారు?

 కుశ మూలే స్థితో బ్రహ్మ, కుశమధ్యే జనార్ధనః కుశాగ్రే శంకరో దేవః త్రయోదేవా కుశేస్థితాః ధర్బల మొదలులో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, చివరి భాగంలో శివుడు ఆవాహనమై ఉంటారు. అందుకే దర్భ అనేది త్రిమూర్తుల స్వరూపం. దర్భలను బ్రహ్మదేవుడు సృష్టించాడు. హిందూ ఆచార సంప్రదాయాలలో దర్భలను పవిత్రంగా వాడతారు. వీటిని కుశలు అని కూడా అంటారు. గరుత్మంతుడు తన తల్లి దాసీతనాన్ని తొలగించటానికి దేవ లోకం నుంచి అమృతకలశం తెచ్చి దర్భల మీద పెట్టి కద్రువ పుత్రులకి చూపించి, తన తల్లిని దాసీతనం నుంచి విముక్తి చేయండి అని కోరతాడు. అలా అమృతభాండం స్పర్శ వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. అందువల్లే సమస్త దేవ, పితృ కార్యాల్లో దర్భలు అంతటి ప్రాముఖ్యతను, అర్హతను పొందాయి. కాలువల ఒడ్డున ఈ గడ్డి పెరుగుతుంది. పచ్చివిగా ఉన్నవాటికంటే ఎండిన దర్భలనే వాడతారు. ఆచార సంపన్నులు దర్భ ఆకారంలో ఉండే ఉంగరాన్ని దర్భాంగుళీయకాన్ని బంగారంతో తయారుచేసి పుణ్యకార్యాలలో వాడతారు. దర్భలు తీసుకొని సంకల్పించి మంత్రజలంతో వాటిని అస్త్రాలుగా మునులు ప్రయోగించారు. శుభంభూయాత్

పంచమి తీర్థం ఎక్కడ ఉంది?

సమాధానం: తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళుల కార్తీకమాసంలో పంచమీ తిథి నాదు పుష్కరిణిలో పద్మతీర్థంలో చక్రస్నానం జరుపుతారు. ఈ తీర్థం స్వయంగా శ్రీనివాసుడే ఏర్పాటు చేశాడని ప్రతీతి. తిరుచానూరులో పుష్కరిణికి పద్మపుష్కరిణి అనీ, పద్మతీర్థం అని పేరు. అమ్మవారు పంచమినాడు జన్మించారు. తిరుమలలో ఆశ్వీయుజ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. చక్రాన్ని చక్రత్తాళ్వార్ అని వైష్ణవ సాంప్రదాయంలో  సంభావిస్తారు. తిరుమలలో వలె తిరుచానూరులోను కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజు పద్మావతిదేవి ఉత్సవమూర్తితో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వైభవంగా తీసుకొస్తారు. అదే సమయంలో తిరుమల నుండి శ్రీవేంకటేశ్వరుడు పద్మావతికి జన్మదిన కానుకగా రెండు పట్టుచీరలు, రెండు పట్టు రవికెలు, పసుపు, చందనం ముద్దలు, తులసిమాలలను సారెగా పంపుతారు. ఏనుగు అంబారీపై వాటిని తిరుమల నుండి ఊరేగింపుగా తెస్తారు. వాటిని ఆలయ కార్యనిర్వహణాధికారి సభక్తికంగా స్వీకరించి అమ్మవారికి సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో వేలాది భక్తులు చక్రంతోబాటు పుష్కరిణిలో స్నానం చేస్తారు. ఆకాశంలో ఆ సమయ

ఆదిత్య హృదయం పఠిస్తే మంచిదా?

సమాధానం: సూర్యుడు కర్మసాక్షి. సమస్త చరాచర ప్రాణులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అని శాస్త్రం. ఇటీవల ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు సూర్యనమస్కారాలకు ప్రాధాన్యం ఇచ్చారు. యోగాభ్యాసంలో అది ఒక భాగం. డి విటమిన్ లోపించిందని వైద్యులు మందులు వ్రాసిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉదయకాలం ఎండలో కూర్చొని పనులు చేసుకొనేవారు. రామాయణంలో రావణునితో యుద్ధానికి రాముడు సిద్దమవుతున్న సమయంలో అగస్త్యమహర్షి వచ్చి రామునికి ఆదిత్యహృదయం బోధించాడు. సర్వ మంగళ మాంగల్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం అంటాడు అగస్త్యుడు. సూర్యకిరణ ప్రభావం వలన శ్యమంతకమణి బంగారాన్ని వర్షించినట్లు శ్రీకృష్ణ-సత్రాజిత్తు కథలో చదివాం. అందువలన నిత్యం ఆదిత్యహృదయం పఠించి, సూర్య నమస్కారాలు చేయడం ఆరోగ్యప్రదం.

దేవుడికి పెట్టే ప్రసాదాలు ఆయన తినడు కదా, మరి ఎందుకు నైవేద్యం పెట్టడం?

సమాధానం: ఈ ధర్మసందేహమే చతుర్ముఖ బ్రహ్మకూ వచ్చింది. ఆయన మహావిష్ణువును అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇది. "నా ఎదుట ఉంచిన విశేష ప్రసాదములను నేను చూపులతో స్వీకరింతును" అని. దర్శనాత్ గృహ్యతే మయా రసాన్ దాసస్య జిహ్వా యా మనశ్నామి కమలోద్భవ "రుచిని మాత్రము నా భక్తుని నాలుక పై నుండి గ్రహింతును." మనం శుచిగా, శుభ్రంగా, రుచిగా ఏమి దేవుడి ముందు నైవేద్యం పెట్టినా అది ప్రసాదం గా మనకు అందుతుంది. దానిని మొదట భక్తులకందించితే, వారు ప్రసాద ప్రతిపత్తితో కొద్దిగా చేతిలో ఉంచుకొని, స్వీకరించి "భగవంతుడు చాలా భోగ్యంగా ఆరగించారు" అంటే అప్పుడది భగవంతుడు స్వీకరించినట్లవుతుంది. అలాగే మనం క్రొత్త వస్త్రాలు, పండ్లు, మొదలైనవి ఏం తీసుకున్నా ఒకసారి మన ఇంట్లో దేవుడి ముందుంచి "స్వామీ! ఇవన్నీ నీ దయవల్లనే మాకు లభించాయి" అని కృతజ్ఞతా పూర్వకంగా భగవంతుడికి నివేదించి స్వీకరించాలి. ఇది మన భారతీయ సంప్రదాయం. జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్  

గంగానదిలో మునిగిలేస్తే పాపాలు పోతాయంటారు, నిజమేనా?

సమాధానమ్: నిజమే. కానీ, ఆ స్నాన సమయంలో సందేహ స్పర్శ లేని, నూటికి నూరు శాతం భక్తి విశ్వాసాలతో గంగాస్నానం చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న పాపాలన్నింటినీ గంగామాత తీసుకుంటుంది. ఇందులో సందేహం లేదు. అయితే చిత్తశుద్ధి మాట మాత్రం మరచిపోవద్దు.

తెలియక చేసిన తప్పులకు పరిహారమేమిటి?

సమాధానమ్: సాంసారిక జీవితంలో ఇలాంటి సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. చాలాచోట్ల తెప్పు తెలియక గతజలసేతుబంధనం లాగా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో మున్ముందుగా తన తప్పును పెద్దల దగ్గర ఒప్పేసుకోవాలి. ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని శపథం చేసుకోవాలి. ఆ తర్వాత చేసిన పాపానికి శాస్త్రీయమైన ప్రాయశ్చిత్తం ఏదో తెలుకునే ప్రయత్నం చేయాలి. అది చెప్పే వారు దొరకకపోయినా, చెప్పినా అది అసాధ్యంగా ఉన్నా, ఈ పాప ప్రాయశ్చిత్త నిమిత్తమని సంకల్పిస్తూ, యథాశక్తిగా భగవన్నామ స్మరణ చేతనైనంత దీర్ఘంగా చేయాలి. సర్వ ప్రాయశ్చిత్త విధులకూ ఇదే సారాంశం.

భార్య చేసే పూజలకన్నా భర్త చేసే పూజల వల్లనే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది ఎంత వరకు నిజం?

సమాధానమ్: మన వేదోక్త కుటుంబ వ్యవస్థ గురించి మన యువతీ యువకులకు సరియైన అవగాహన లేకపోవటం వల్లే ఇలాంటి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. మన వ్యవస్థలో భర్త ముందు జన్మిస్తాడు. తర్వాత భార్య జన్మిస్తుంది. భర్త కుటుంబానికి నాయకుడు. భార్య ఆ కుటుంబానికి దీపం. భర్త ఏ దైవకార్యం చేసినా ధర్మపత్నీ సమేతస్య మమ అని సంకల్పం చెప్పుకోవాలి. భార్య సభర్తృకాయాః మమ అని చెప్పుకోవాలి. ఇది అవశ్యవిధి. ఇలాంటి వ్యవస్థలో ఒకరి పుణ్యం ఎక్కువ అనీ, ఒకరిది తక్కువనీ అనుకోకూడదు.

దినసరి పంచాంగము - ॐ 08-06-2021 (Daily Panchangam)

ధరణీ గర్భ సంభూతం విద్యుద్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం 08/06/2021 మంగళవారం శ్రీ ప్లవ నామ సం"రం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణ పక్షము త్రయోదశి తిథి ఉ" 10-53 వ. భరణి నక్షత్రం ఉ" 05-43 వ తదుపరి కృత్తిక నక్షత్రము వర్జ్యం రా" 07-01 > 08-47 వ. రాహు కాలం:- మ" 03-00 > 04-30 దుర్ముహూర్తం:- ఉ" 08-24  > 09-12 పు.దుర్ముహూర్తం;- రా" 10-48 > 11-36 యమ గండం:- ఉ" 09-00 >10-30

కారణం

"అజ్ఞానం మరియు అమానుషత్వం" ఈ రెండే మానవాళి కష్టాలకు కారణాలు. "బాహ్య ప్రకృతి, అలవాటు, బలహీనత, కోరిక, ఉన్మాదం, యాదృచ్ఛికత, సంకల్పం" అన్ని మానవ కార్యాలకు ఈ ఏడింటిలో ఒకటి కానీ, కొన్ని కానీ లేక అన్నీ కానీ కారణాలై ఉంటాయి. మన దుఃఖాలకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మన శక్తికి మించిన దాన్ని నియంత్రించాలని ప్రయత్నించడం, రెండు మన వల్ల అయ్యే వాటిని విస్మరించడం.

రాశి ఫలితాలు మరియు పరిహారాలు - Weekly Horoscope 06-06-2021 నుండి 12-06-2021 వరకు

అన్ని రాశుల వారి రాశి ఫలాలు 06th to 12th June 2021       మేష రాశి , వృషభ రాశి , మిథున రాశి , కర్కాటక రాశి , సింహ రాశి , కన్య రాశి , తుల రాశి , వృశ్చిక రాశి , ధనుస్సు రాశి , మకర రాశి , కుంభ రాశి , మీన రాశి ఫలితాలు మరియు పరిహారాలు 06-06-2021 నుండి 12-06-2021 వరకు   నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు  శ్రీహనుమాన్ జ్యోతీషాలయం  జ్యోతీషం మరియు ఆధ్యాత్మిక నిలయం.

మంగళవారాన్ని అశుభదినమని ఎందుకు భావిస్తారు?

సమాధానమ్: జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎందుకూ పనికిరాని అశుభదినం లేదు. అలాగే అన్నింటికీ పనికివచ్చే ఒకే ఒక వారమంటూ లేదు. మంగళవారానికి కుజుడు అధిపతి గనుక, యుద్ధాలు, ఆయుధ వ్యవహారాలు, ఇలాంటి వాటికి అది శుభప్రదం. వివాహ ఉపనయనాలకు అశుభం. వారానికి గల అధిపతిని బట్టి ఈ భేదం ఉంటుంది.

మంచి మాట - 17

 ప్రయత్నిద్దాం ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లేకపోతే పట్టించుకోకుండా, ప్రశాంతంగా ఉందాం. అంతే కానీ చింతించడం సమస్యను తీర్చదు కదా.

దినసరి పంచాంగము - ॐ 05-06-2021 (Daily Panchangam)

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్, ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరమ్ 05/06/2021 శనివారం శ్రీ ప్లవ నామ సం"రం ఉత్తరాయణం  వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణ పక్షం దశమి తిథి ఉ" 06-02 వ. తదుపరి ఏకాదశి తిథి. రేవతి నక్షత్రం రా" 12-58 వ. వర్జ్యం మ" 12-03 > 01-46 వ. రాహుకాలం;- ఉ"09-00 >10-30 దుర్ముహూర్తం;- ఉ"06-00 > 06-48 పు.దుర్ముహూర్తం;- ఉ"06-48 > 07-36 యమ గండం;- మ"01-30 > 03-00 శుభం భూయాత్